శాసన మండలి సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డిని రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఛైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పల్లాను రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఛైర్మన్, డైరెక్టర్గా నియమించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. రాజేశ్వర్ రెడ్డి మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఆయన కేబినెట్ మంత్రి హోదాలో కొనసాగనున్నారు.
ఇవీ చూడండి: 'అప్పుడు తిట్టిన నేనే ... ఇప్పుడు పొగుడుతున్నా'