పుట్టిన రోజు సందర్భంగా... తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా... తన జన్మదినాన ప్రగతిభవన్‌లో తల్లి శోభతో కలిసి మొక్కలు నాటారు.
అమ్మ, అన్నయ్యతో కలిసి మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని కవిత హర్షం వ్యక్తం చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ... పచ్చదనం పెంచడం కోసం కృషి చేస్తున్న సంతోష్‌కుమార్‌ను ప్రశంసించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగం చేస్తూ... తన చేత మొక్కలు నాటించి పుట్టిన రోజుకు మంచి బహుమతి అందించారని కవిత కృతజ్ఞతలు తెలిపారు.