కామన్వెల్త్ బాక్సింగ్ క్రీడల్లో నిఖత్‌జరీన్ సాధించిన విజయం యువక్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కామన్వెల్త్ గేమ్స్-2022లో మహిళల 50కేజీల బాక్సింగ్‌లో బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్‌ను కవిత తన నివాసంలో అభినందించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ ప్రపంచబాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌గా నిలవడం గర్వకారణమని ఆమె పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కవిత ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి ఆర్థికంగా ఆదుకోవాలని కోరగా వెంటనే సీఎం కేసీఆర్ 2014లో50లక్షలు మంజూరుచేశారని నిఖత్ గుర్తుచేసుకున్నారు. ఆ మొత్తంతో పాటు అదనంగా 2కోట్లు మంజూరు చేసి నివాస స్థలం కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌కి నిఖత్ జరీన్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చదవండి: