కోర్టులపై తమకు నమ్మకం ఉందని.. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు ప్రతిపాదనపై న్యాయపోరాటం చేస్తామని ప్రభుత్వ విప్‌లు కర్నె ప్రభాకర్, గువ్వల బాలరాజు వెల్లడించారు. ఏపీని వదిలి కర్ణాటకపై పోరాటం చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు.. దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ ప్రభుత్వంతో ఎలాంటి లాలూచీ లేదని... రాష్ట్ర ప్రయోజనాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపును తెరాస ముందు నుంచీ వ్యతిరేకిస్తోందన్నారు. గతంలో నీటి తరలింపును సమర్థించిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని కర్నె ధ్వజమెత్తారు. ఆనాడు ఆంధ్రా నేతలకు మంగళ హారతులు పట్టిన డీకే అరుణ వంటి నేతలు.. ఇప్పుడు గొంతు చించుకొని మాట్లాడుతున్నారని గువ్వల బాలరాజు ధ్వజమెత్తారు. ప్రాజెకుల నిర్మాణంలో కేసీఆర్ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని స్పష్టం చేశారు.
ఇవీచూడండి: నీళ్లమీద మాకున్న చిత్తశుద్ధి వారికెక్కడిది..: నిరంజన్‌రెడ్డి