ఇసుక సరఫరాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని కొత్తపేట వైకాపా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొత్తపేట వైకాపా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు.
ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకుందామని ఓపెన్ చేస్తే ఐదు నిమిషాల్లో క్లోజ్ అయిపోతుందని... తనకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే అన్నారు. కోనసీమలో చుట్టూ ఇసుక ఉన్నా ఇల్లు కట్టుకునేందుకు ఇసుక దొరకడం లేదన్నారు. కోనసీమలో 10 ఇసుక ర్యాంపులున్నా ఒక్కదాన్నీ ప్రభుత్వం ప్రారంభించలేదని ఆయన విమర్శించారు. తాను లేఖ ఇచ్చినా రెండు ట్రక్కుల ఇసుక ఇవ్వడం లేదని జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: 'ఏడాది పాలనలో అప్పులు తప్ప.. అభివృద్ధి శూన్యం'