ETV Bharat / city

రానున్న రోజుల్లో మెడికల్​ హబ్​గా తెలంగాణ..: సబితాఇంద్రారెడ్డి - mla sudheer reddy

హైదరాబాద్​లోని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో మూడు పూటల భోజన పథకాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభించారు. రోగుల సహాయకులకు స్వయంగా భోజనం వడ్డించిన మంత్రి.. వారితో కలిసే భోజనం చేశారు. భోజనం చేస్తూనే.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

minister sabitha indra reddy started meals scheme in vanastalipuram

author img

By

Published : May 12, 2022, 9:33 PM IST

రానున్న రోజుల్లో మెడికల్​ హబ్​గా తెలంగాణ..: సబితాఇంద్రారెడ్డి

రానున్న రోజుల్లో రాష్ట్రం మెడికల్ హబ్​గా మారనుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగి సహాయకులకు మూడు పూటలా భోజన సదుపాయం అందించడం కోసం తీసుకొచ్చిన సరికొత్త పథకాన్ని.. వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. రోగుల సహాయకులకు స్వయంగా భోజనం వడ్డించిన మంత్రి.. వారితో కలిసే భోజనం చేశారు. భోజనం చేస్తూనే.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 5 రూపాయలకే.. రోగి సహాయకులకు 3 పూటలా భోజన సదుపాయం కల్పించే సదుద్దేశంలో ఈ పథకం ప్రారంభించినట్టు మంత్రి తెలిపారు.

"రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు వెళ్తుంది. వైద్యరంగాన్ని సీఎం కేసీఆర్​ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్​లో 13 చోట్ల ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 15 ఆస్పత్రుల్లో అన్ని రకాల రక్తపరీక్షలు మినీహబ్​లు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందిస్తున్నాం. 130 రకాల రక్తపరీక్షలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్​సీ సెంటర్లను ఏర్పాటు చేశాం. రాబోవు రోజుల్లో రోగి సహాయకులకు రెస్ట్​రూంలు నిర్మించతలపెట్టాం. పేదవారి కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి కాబట్టే.. ప్రజల కోసం సీఎం కేసీఆర్ ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు." -సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.