వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు బాబు జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని నిజాం కళాశాల వద్ద ఆయన విగ్రహానికి నివాళులర్పించారు.
మంత్రి ఈటలతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, గద్దర్ తదితర నాయకులు జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.