ETV Bharat / city

Mahila Darbar : నేడు రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ - రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్‌

Mahila Darbar at Raj Bhavan : మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, భద్రతకు సంబందించిన అంశాలపై చర్చకు రాజ్‌భవన్‌ వేదిక కానుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రాజ్ భవన్‌లో మహిళా దర్బార్‌ జరగనుంది. మహిళలు బయటకు చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న అంశాలపై చర్చించనున్నారు.

Mahila Darbar at Raj Bhavan
Mahila Darbar at Raj Bhavan
author img

By

Published : Jun 10, 2022, 8:08 AM IST

Mahila Darbar at Raj Bhavan

Mahila Darbar at Raj Bhavan : రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తమిళిసై సౌందర్‌ రాజన్ వినూత్న కార్యక్రమాలతో తనదైన ముద్ర వేస్తున్నారు. అందులో భాగంగా గతంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. రాజ్‌భవన్ బయట ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం మహిళా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మహిళలతో కార్యక్రమంలో గవర్నర్‌ పాల్గొననునట్టు ప్రకటించారు. మహిళలు బయటకు చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న అంశాలు, భద్రతపై చర్చించనున్నారు.

కొంతకాలంగా రాజ్ భవన్‌లో చేపడుతున్న కార్యక్రమాలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అయినప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారంలో వెనకడుగు వేయబోమని గవర్నర్ తమిళిసై గతంలోనే స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళా దర్బార్ నిర్వహించనున్నట్టు ప్రకటించటం మరోసారి రాజకీయంగా చర్చలకు దారితీసింది. గవర్నర్ మహిళా దర్బార్ నిర్వహించడాన్ని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వాగతించగా.... సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజ్‌భవన్ రాజకీయాలకు కేంద్రంగా మారుతోందని విమర్శించారు.

ఒకవైపు మహిళా దర్బార్‌ కార్యక్రమం రాజకీయ దుమారానికి దారితీయగా... మరోవైపు రాష్ట్రంలో మహిళలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.