ETV Bharat / city

శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. మూలవిరాట్టును పట్టువస్త్రంతో పూర్తిగా కప్పివేశారు అర్చకులు. సుగంధద్రవ్యాలు కలిసిన పవిత్ర జలంతో ప్రదక్షిణంగా వెళ్లి ఆలయశుద్ధి చేశారు.

author img

By

Published : Jul 16, 2019, 11:20 AM IST

ttd

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనంను తితిదే వైభవంగా నిర్వహిస్తోంది. ఆణివార ఆస్థానంను పురస్కరించుకొని ఆలయశుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. సుప్రభాతం, అర్చనసేవల తర్వాత మూలవిరాట్టుపై పట్టువస్త్రంతో పూర్తిగా కప్పివేసి సుగంధద్రవ్యాలు కలిసిన పవిత్ర జలంతో ఆలయశుద్ధి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆనందనిలయం, బంగారువాకిలి, ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజాసామగ్రి వస్తువులను శుభ్రపరుస్తున్నారు. 11 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుండగా, ప్రత్యేక పూజ, నైవేధ్యం సమర్పించాక 12 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

చంద్రగ్రహణం వల్ల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్న అధికారులు

చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. రాత్రి 7 నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు ఆలయ తలుపులు మూసివేస్తారు. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగానే ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ కావడం వల్ల... సాయంత్రం 5 గంటల నుంచి రేపు ఉదయం వరకు స్వామివారి దర్శనానికి అనుమతి నిలిపివేయనున్నారు. ఆలయంతో పాటు అన్నప్రసాద వితరణ, వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని మూసివేయనున్నట్లు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం

ఇదీ చూడండి: 'శాకాంబరీ అవతారంలో భద్రకాళీ'

Intro:సెంటర్ :తణుకు, జిల్లా :పశ్చిమ గోదావరి
రిపోర్టర్: ఎం. వెంకటేశ్వర రావు
AP_TPG_13_12_PALANGI_KANAKADURGA_AV_AP10092
( . )ఆషాఢం మాసం తొలి ఏకాదశి పర్వదినాన్న పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగిలో వేంచేసి ఉన్న కనకదుర్గ అమ్మవారు భక్తులకు శాకంబరి అలంకారంలో దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తున్నారు. Body:అమ్మవారిని సుమారు టన్ను బరువు గల కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారితో పాటు ఆలయ ప్రాంగణాన్ని, ఆలయం ముందు భాగాన్ని కూరగాయలతో తీర్చి దిద్దారు. Conclusion:అమ్మవారిని శాకంబరి అలంకారంలో దర్శించుకుంటే భవిష్యత్తులో అన్నపానాదులకు లోటుండదని భక్తులు నమ్ముతారు. తెల్లవారుజామునుంచే అధికసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.