కృష్ణానదిలో తెలంగాణ వాటాను కాపాడటంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంతో గోదావరి నదీ జలాలను కోల్పోవాల్సి వస్తుందని.. దీన్ని ఆపాలని కోదండరాం డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన జీవో 72ను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోట్లాడితేనే పాలమూరు ఎత్తిపోతల పథకం వచ్చిందని తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రజలు సహకరించాలని కోరారు.
ఇవీ చూడండి: 'పుర పోరుపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలిసి కుట్ర'