ETV Bharat / city

Kedarnath will open for devotees: తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ఆలయం

Kedarnath will open for devotees: మే6 ఉదయం 6.25 గంటలకు కేదార్​నాథ్​ ఆలయం తెరవనున్నట్లు అధికారులు ప్రకటించారు. వృశ్చిక లగ్నంలో ఆలయ ద్వారాలు తెరుస్తామని ఆలయ కమిటీ అధికారి హరీష్ గౌడ్ తెలిపారు.

Kedarnath
Kedarnath
author img

By

Published : Mar 2, 2022, 7:20 PM IST

Kedarnath to open on May 6: ఛార్​ధామ్​లో భాగమైన కేదార్​నాథ్​ ఆలయం తలుపులు తెరవడానికి అధికారులు తేదీని ప్రకటించారు. మే6న ఉదయం 6.25 గంటలకు తెరవనున్నట్లు వెల్లడించారు. మహాశివరాత్రి సందర్భంగా ఓంకారేశ్వర్ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల అనంతరం కేదార్‌నాథ్ ఆలయం తెరవడానికి అనుకూలమైన తేదీని ప్రకటించారు.

char dham yatra: ఉత్తరాఖండ్​లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్​నాథ్ ఆలయాన్ని​.. శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో నవంబర్​ 6, 2021న మూసివేశారు. ఉత్తరాఖండ్​లోని యమునోత్రి, గంగోత్రి, కేదార్​నాథ్ (kedarnath temple news)​, బద్రీనాథ్​ ఆలయాలను కలిపి చార్​ధామ్​గా పిలుస్తారు.

వృశ్చిక లగ్నంలో కేదార్​నాథ్ ద్వారాలు తెరుస్తామని ఆలయ కమిటీ అధికారి హరీష్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేదార్‌నాథ్ ప్రధాన పూజారి రావల్ భీమశంకర్ లింగ్, బద్రీ-కేదార్ ఆలయ సమితి అధ్యక్షుడు అజేంద్ర అజయ్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.