ETV Bharat / city

ఒక్క రోజే పది మందికి కరోనా పాజిటివ్​..జాగ్రత్త సుమా..! - coronavirus updates

రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 59కి చేరాయి. ఇవాళ ఒక్కరోజే 10 మందికి వైరస్​ నిర్ధరణ అయినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. లాక్‌డౌన్‌, కర్ఫ్యూ లేకపోతే భయంకర పరిస్థితులు వచ్చేవని అభిప్రాయపడ్డారు. నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించే సమయం ఇది కాదన్నారు. స్వీయ నియంత్రణే మనకు శ్రీరామరక్షని పునరుద్ఘాటించారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్
author img

By

Published : Mar 27, 2020, 4:56 PM IST

Updated : Mar 27, 2020, 5:02 PM IST

రాష్ట్రంలో ఇప్పటివరకు 59 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలిపారు. ఒక వ్యక్తి ఆస్పత్రిలో కోలుకుని ఇంటికి వెళ్లారని వెల్లడించారు. రాష్ట్రంలో 20 వేల మంది స్వీయ నిర్బంధంలో ఉన్నారని సీఎం ప్రకటించారు. వీరంతా ఐసోలేషన్‌, ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు.

ఒక్క రోజే పది మందికి కరోనా పాజిటివ్​

ఇవాళ ఒక్కరోజే 10 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌, కర్ఫ్యూ లేకపోతే భయంకర పరిస్థితులు వచ్చేవని వివరించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా కేసులు నమోదు అవుతున్నాయని చెప్పుకొచ్చారు. ప్రపంచంలో ఈ వ్యాధికి మందులు లేకపోవడం పెద్ద బలహీనతని అన్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించడమే పెద్ద మందన్నారు.

మన చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం సామాజిక దూరం పాటించడమేనని విజ్ఞప్తి చేశారు. స్వీయ నియంత్రణ, పారిశుద్ధ్య చర్యలు పాటించడం తప్ప గత్యంతరం లేదన్నారు. స్వీయ నియంత్రణే మనకు శ్రీరామరక్షని పునరుద్ఘాటించారు. నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించే సమయం ఇది కాదన్నారు. అన్ని చర్యలకు ప్రభుత్వం వంద శాతం సిద్ధంగా ఉందని వెల్లడించారు. రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తామని ప్రధాని భరోసా ఇచ్చినట్లు తెలిపారు.

Last Updated : Mar 27, 2020, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.