హైదరాబాద్ కిస్మాత్‌పూర్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పూర్ణిమా -రామం ఆత్మకూరి టెక్నాలజీ కేంద్రాన్ని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారభించారు. రాష్ట్రంలో కంటి వైద్య పరికరాల తయారీకి ఎవరైనా ముందుకు వస్తే... వారికి ప్రత్యేక ఇన్సెంటివ్‌లు ఇవ్వడంతో పాటు... సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన వైద్య పరికరాల తయారీ పార్కులో ప్రత్యేకంగా క్లస్టర్‌ను రూపొందిస్తామని తెలిపారు. సుమారు 80 శాతం వైద్య పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. వైద్య పరికరాల తయారీకి సహకరించేందుకు కేసీఆర్ సర్కార్ ఎల్లప్పుడు ముందు ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు... ఆసుపత్రి వ్యవస్థాపకులు గుల్లపల్లి నాగేశ్వర్ రావు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కంటి వైద్యంలో అవసరమైన లెన్స్‌లు సహా అనేక రకాల కంటి పరికరాల తయారీ కోసం ఈ టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: KRMB: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ప్రభుత్వం మరో లేఖ