ETV Bharat / city

అంటువ్యాధులు నివారించేందుకు ముంపు ప్రాంతాల్లో ఇంటెన్సివ్ డ్రైవ్

హైదరాబాద్​లోని వరద ముంపు ప్రాంతాల్లో అంటు వ్యాధులను అరికట్టేందుకు జీహెచ్​ఎంసీ వచ్చె నెల 7 వరకు ఇంటెన్సివ్ డ్రైవ్ చేపట్టింది. నగరంలోని 235 కాలనీలు, 39 చెరువులతో పాటు మూసీలో యాంటీ లార్వా, క్రిమి సంహారకాల స్ప్రేయింగ్ చేయిస్తున్నట్లు తెలిపారు. అంటువ్యాధుల నివారణపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.

అంటువ్యాధులు నివారించేందుకు ముంపు ప్రాంతాల్లో ఇంటెన్సివ్ డ్రైవ్
అంటువ్యాధులు నివారించేందుకు ముంపు ప్రాంతాల్లో ఇంటెన్సివ్ డ్రైవ్
author img

By

Published : Oct 31, 2020, 12:19 PM IST

హైదరాబాద్​లో అంటు వ్యాదులను అరికట్టేందుకు వరద ముంపు ప్రాంతాల్లో వచ్చే నెల 7 వరకు యాంటీ లార్వా, సోడియం హైపో క్లోరైట్, క్రిమి సంహారకాల స్ప్రేయింగ్​ కోసం ఇంటెన్సివ్ డ్రైవ్ చేపట్టినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్​ కుమార్ తెలిపారు. నగరంలోని 235 కాలనీలు, 39 చెరువులతో పాటు మూసీలో యాంటీ లార్వా, క్రిమి సంహారకాల స్ప్రేయింగ్ చేయిస్తున్నట్లు తెలిపారు. గ్రేటర్​లో 125 బృందాల ద్వారా నీటి నిల్వ ప్రాంతాలు, నాలాల్లో యాంటీ మలేరియా స్ప్రేయింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

వరద నీటిని తొలగించిన 252 ప్రాంతాలు, 62 వేల ఇళ్ల లోపల పరిసరాల్లో క్రిమి సంహారకాలు చల్లారు. ఇప్పటి వరకు 45 వేల లీటర్ల సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని చల్లినట్లు పేర్కొన్నారు. 2 లక్షల గంబూషియా చేప పిల్లలను, 5,500 ఆయిల్ బాల్స్​ను నాలాలు, కాలువలు, చెరువుల్లో వదిలారు. 54 మంది సిబ్బందితో కూడిన 4 బృందాలచే మూసీ నదిలోపల దాని చుట్టు పక్కల యాంటీ లార్వా, క్రిమి సంహారకాల స్ప్రేయింగ్ చేస్తున్నారు.

చెరువుల్లో స్ప్రేయింగ్​కు 10 డ్రోన్లను వినియోగిస్తున్నారు. నిర్దేశిత 39 చెరువుల్లో ఇప్పటి వరకు 17 చెరువుల్లో స్ప్రేయింగ్ పూర్తయినట్లు కమిషనర్ వెల్లడించారు. మరో వారంలో అన్ని చెరువుల్లో స్ప్రేయింగ్ పూర్తవుతుందన్నారు. ఎంటమాలజి సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి కరపత్రాలు, స్టిక్కర్లు పంపిణీ చేసి డెంగ్యూ, మలేరియ, చికెన్ గున్యా, ఫైలేరియా, మెదడు వాపు, కొవిడ్ నివారణకై తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి: రైతు వేదికల నిర్మాణంతో కొత్తశకం... నేడు ప్రారంభించనున్న సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.