రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన (Rain Alert for telangana) తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న (Rain Alert for telangana) ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కి.మీ ఎత్తులో స్థిరంగా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ ఆంధ్రప్రదేశ్ - ఉత్తర తమిళనాడు తీరం వద్ద ఉన్న పశ్చిమ, మధ్య దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలకు ఈనెల 18 ఉదయానికి చేరుకునే అవకాశం (weather updates in telangana) ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఇదీచూడండి: RAIN ALERT: అల్పపీడనం ఎఫెక్ట్.. ఆ జిల్లాలకు వర్షసూచన