"నా భార్యకు ఆరోగ్యం బాగా లేకుంటే ఓ ప్రైవేట్ దవాఖానాలో చేర్చిన.. వాళ్లు గాంధీకి తీసుకెళ్లమని చెప్పారు. మళ్లీ నేను తీసుకెళ్లిన అంబులెన్సులోనే పడేశారు. అప్పటికే బ్రీతింగ్ ప్రాబ్లెమ్ ఎక్కువైంది. గాంధీలో ఓ సీఐ గారు ఉన్నారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పారు. నేను ఓ హెడ్‌కానిస్టేబుల్‌ని సర్.. నా భార్య పరిస్థితి ఏం బాలేదు.. హైదరాబాద్‌లో అన్ని ఆస్పత్రులకు తిప్పినం.. కరోనా ఉందో, లేదో అర్థం కావడం లేదు.. దయచేసి లోపలికి పంపండి సర్ అని వేడుకున్నా... సీపీ సర్ చెప్పారు.. తమరు దయతలచి లోపలికి పంపండి.. వెంటిలేటర్ పెట్టించి నా భార్యను కాపాడండి.. అని ప్రాధేయపడ్డా.. ఆయన కనికరించలేదు.
అడిషనల్ డీసీపీ సాబ్ కూడా ఫోన్ చేసి చెప్పిండు. అయినా ఆయన కనికరించలేదు. అర్ధరాత్రి ఒంటిగంటకు అక్కడి నుంచి వెళ్లగొట్టాడు. ఒక కిలోమీటర్ దూరం వెళ్లగానే నా భార్య చనిపోయింది. కాళ్లూ చేతులు కొట్టుకుంటూ ఊపిరాడక నరకయాతన పడుతూ నా కళ్లముందే చనిపోయింది." అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.
- లతీఫ్, హెడ్‌కానిస్టేబుల్
ఆ సీఐ సాబ్ కనికరించి ఉంటే.. ఆయన విధులను నిజాయితీగా చేసుంటే.. పాపం ఆ హెడ్‌కానిస్టేబుల్ ఇంటి దీపం నిలిచేదేమో!
ఇవీచూడండి: 'ఐదో రోజూ 30 వేలకుపైగా కరోనా రికవరీలు'