ఏం జరిగింది...?
నాలుగో తరగతి చదువుతున్న సౌజన్య మంగళవారం రోజు భోజనం చేసి పాఠశాల ఆవరణలో కూర్చొని ఉంది. అంతలోనేతన కళ్లకు బలంగా గాయమైనట్లు అనిపించి ఏడుస్తుండగా... తోటి విద్యార్థినులు టీచర్‌కు చెప్పారు. టీచర్ ఐస్‌ను పాప కళ్లపై రాసింది. ఇంతలో తల్లిదండ్రులు వచ్చి సౌజన్యను ఆస్పత్రికి తీసుకెళ్లారు.
డాక్టర్లు బాధితురాలి కంటికి శస్త్రచికిత్స చేశారు. ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక తల్లిదండ్రులు స్కూల్‌కు వచ్చి ఉపాధ్యాయులను నిలదీశారు. సీసీటీవీ ఫుటేజ్‌లు చూపించమంటే నిరాకరిస్తున్నారని సౌజన్య తల్లి చెబుతున్నారు.
ఇదే విషయం ప్రిన్సిపాల్‌ను అడగగా... ఆ సమయంలో తాను పాఠశాలలో లేనని, రెండు రోజులుగా స్కూల్లో లేనని అంటున్నారు. పాపపై దాడి చేసింది ఎవరు అనే విషయం తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండిఃటర్కీలో షూటింగ్... హీరో విశాల్‌కు గాయాలు