ETV Bharat / city

ఒకవైపు ఆనందం.. మరోవైపు దుఃఖం.. రెండు ఒకేసారి.! - భార్య గెలుపు వార్త విన్న మరుక్షణమే భర్త మృతి

ఏపీ మున్సిపల్​ ఎన్నికల్లో గెలుపు సాధించిన ఆమెకు... విజయానందం ఎంతోసేపు నిలవలేదు. కౌన్సిలర్​ కాబోతున్నాననే ఆనందం కంటే భర్తను కోల్పోయాననే వేదనే ఆమెకు మిగిలింది. 18 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. భార్య గెలుపు వార్త విన్న కొద్దిసేపటికే భర్త కన్నుమూసిన విషాద ఘటన తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో జరిగింది.

husband-died-in-amalapuram-after-her-wife-won-councilor
ఒకవైపు ఆనందం.. మరోవైపు దుఃఖం.. రెండు ఒకేసారి.!
author img

By

Published : Mar 15, 2021, 7:18 AM IST

భార్య మున్సిపల్​ ఎన్నికల్లో విజయం సాధించిందని తెలిసిన కాసేపటికే భర్త మరణించిన ఘటన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో జరిగింది. అమలాపురం మున్సిపాలిటీలోని పదో వార్డు వైకాపా అభ్యర్థిగా పోటీచేసిన కొల్లాటి నాగ వెంకట దుర్గాబాయి 115 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

అయితే గత 18 రోజులుగా ఆమె భర్త వీర్రాజు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం భార్య గెలుపు వార్త విన్న మరుక్షణమే ఆయన కన్నుమూశారు. దీంతో విజయం సాధించిన ఆనందం ఆమెకు ఎంతసేపు నిలువలేదు. మరోవైపు దుర్గాబాయి తల్లి లక్ష్మీ మాణిక్యం ఈనెల 13న అనారోగ్యంతో మృతి చెందారు. ఇప్పుడు భర్త మరణం.. ఆమెను మరింత కలచివేసింది.

ఇదీ చదవండి: 'పట్టణప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.