కరోనా... ప్రపంచాన్ని, మానవ జీవన విధానాన్ని సమూలంగా మార్చేసింది. ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌తో ఇంటికి పరిమితమైంది. కొన్ని సడలింపులు ఉన్నా... కరోనాకు ముందున్న సాధారణ జీవితం ఇప్పుడు లేకుండా పోయింది. భౌతిక దూరం, మాస్కులు జీవితంలో భాగమయ్యాయి. పనులు లేవు.. ఉద్యోగాలు ఉంటాయో పోతాయో తెలియని ఆందోళన కొందరిది... కరోనా యాంగ్జైటీ మరికొందరిది... కానీ అందరూ కోరుకునేది ఒక్కటే... ఈ విపత్తు నుంచి ఎంత తొందరగా బయట పడితే అంత మంచిదని. వీడియో చూస్తున్నప్పుడు యాడ్ వస్తే స్కిప్ చేసినట్లు.. ఈ కరోనా కష్టాలను కూడా స్కిప్ చేసేలా ఉంటే ఎంత బావుండో అనిపిస్తుంది కదా!
రెండు నెలలుగా ఇంట్లోనే. బయటకు వెళ్లాలంటే భయం. వెళ్లినా.. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. భౌతికదూరం, శానిటైజర్ లాంటి ఎన్నో కొత్త పదాలు... టీవీ చూస్తే చాలు కరోనా వార్తలు. కొవిడ్ వల్ల జీవితం ఎంతలా మారిందో... అని ఆలోచించని వారొక్కరుండరు. ఐపీఎల్ స్కోర్ చూడాల్సిన చోట.. కరోనా స్కోర్ చూస్తున్నమనే ఆందోళన ప్రతి ఒక్కరిలో ఉంది. వేసవి సెలవులను ఎంజాయ్ చేసే సమయంలో ఇంటికే పరిమితమై మానసిక ఆందోళన అనుభవిస్తున్నారు. వలస కూలీల ఇక్కట్లకు చలించని వాళ్లు లేరు. కరోనా కేసులు... మరణాలు మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి.
కుటుంబానికి దూరంగా కొందరు. అంతా ఒకేదగ్గర ఉన్నా... భౌతిక దూరం. ఆత్మీయ స్పర్శ లేదు. ఈ కరోనా కాలానికి ముందు ఎలా ఉండేది జీవితం.. ఇప్పుడు ఎంతలా మారింది. ఇలాంటి రోజులొస్తాయని కల్లో కూడా ఎవరూ ఊహించి ఉండరు. బిఫోర్ కరోనాకు వెళ్లే మార్గం ఉంటే బావుండని... మళ్లీ పాత రోజులు కావాలని కోరుకోని వారుండరు. వాక్సిన్ తొందరగా కనిపెడితే... ఈ మాస్కులు, భౌతిక దూరంలేని మన ప్రపంచంలోకి మళ్లీ వెళ్లే రోజులు రావాలని ఆశిద్దాం.
కరోనా కాలాన్ని స్కిప్ చేసేలా ఉంటే ఎంత బావుండు! - కరోనా వైరస్ ప్రత్యేక కథనాలు
గత కొన్ని నెలలుగా ప్రపంచమంత కొత్తగా కనిపిస్తోంది కదూ! ఈ తరానికి అలవాటు లేని ఎన్నో పనులు చేస్తున్నాం కదా! ముఖానికి మాస్కు, భౌతిక దూరం... వాటికి మించి ఇంట్లో నుంచి కదలకుండా లాక్‌డౌన్. కంటికి కనిపించని వైరస్‌తో మూడో ప్రపంచ యుద్ధం చేస్తున్న ఫీల్ మాత్రం అనిపిస్తోంది. ఇంకా ఎంత కాలం ఇలా? ఈ కరోనా కాలాన్ని స్కిప్ చేస్తే బావుండని అనిపించింది కదూ!