HIGH COURT: చింతామణి నాటకం నిషేధంపై స్టే ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఎంపీ రఘురామకృష్ణరాజు తరఫున న్యాయవాది ఉమేష్ అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి అంగీకరించలేదు. నాటకానికి సంబంధించిన అసలు, అనువాద పుస్తకాలు సమర్పించాలని ఆదేశిస్తూ.. విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది.
చింతామణి నాటకాన్ని నిషేధించడాన్ని సవాల్ చేస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున న్యాయవాది ఉమేష్ వాదనలు వినిపిస్తూ.. చింతామణి నాటకాన్ని నిషేధించడం అంటే.. వాక్ స్వాతంత్య్రాన్ని హరించడమే అవుతుందన్నారు. నాటకాన్ని నిషేధించిన కారణంగా పలువురు జీవన ఉపాధి కోల్పోయారని.. దేవదాసి చట్టానికి వ్యతిరేకంగా ఈ నాటకం వచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చింతామణి నాటకాన్ని నిషేధించాల్సిన అవసరం లేదని వేడుకున్నారు. నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు.
ఇవీ చదవండి: