ETV Bharat / city

సందేహాల నివృత్తికి.. కాల్ యువర్ గవర్నర్ - ప్రజల సందేహాలకు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సమాధానాలు

వరదల సమయంలో తలెత్తే అనారోగ్య సమస్యలు, మందుల వాడకంపై ప్రజల్లో సందేహాలు నివృత్తి చేసేందుకు... గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రజలతో మాట్లాడనున్నారు. సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు కాల్​ యువర్​ గవర్నర్ కార్యక్రమం చేపట్టనున్నారు.

governor thamili sai soundara rajan held call your governor on evening
సందేహాల నివృత్తికి.. కాల్ యువర్ గవర్నర్
author img

By

Published : Oct 15, 2020, 3:43 PM IST

governor thamili sai soundara rajan held call your governor on evening
సందేహాల నివృత్తికి.. కాల్ యువర్ గవర్నర్

గవర్నర్​గా రాష్ట్రంలో అడుగుపెట్టిన నాటి నుంచే తనదైన ముద్ర వేశారు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్. విద్య, వైద్యం, మహిళల అభివృద్ధి సహా పలు అంశాలపై తన అభిప్రాయాన్ని విస్పష్టంగా ప్రకటించటమే కాదు... రాజ్ భవన్ ఉద్యోగుల కోసం విభిన్న కార్యక్రమాలు చేపట్టారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ... సమస్యలను తెలుసుకంటూ... తగిన పరిష్కారాలను సైతం ప్రభుత్వానికి సూచిస్తుంటారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య రంగం పట్ల గవర్నర్ ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతుంటారు.

ప్రస్తుతం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తిన సమయంలో ప్రజల ఆరోగ్యం పైట్ల మరింత అవగాహన కల్పించాలని భావించిన గవర్నర్... కాల్ యువర్ గవర్నర్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదున్నర ప్రజలతో ఫోన్​లో మాట్లాడనున్నారు. స్వతహాగా వైద్యురాలైన గవర్నర్... వరదల సమయంలో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మందుల వాడకంపై ప్రజల్లోని సందేహాలను నివృత్తి చేయనున్నారు. గవర్నర్​తో మాట్లాడాలనుకునే వారు 040- 23310521 నెంబర్​కి కాల్ చేయాలని సూచించారు.

ఇదీ చూడండి: వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 8మంది గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.