ETV Bharat / city

Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళిసైకి అరుదైన అవకాశం.. - గవర్నర్ తమిళసై సౌందర రాజన్

దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో 51వ గవర్నర్ల సదస్సు(Governors LGs conference) జరిగింది. సదస్సులో గిరిజన అభివృద్ధి, ఆరోగ్య సంబందిత అంశాల(tamilisai speech on Health & vaccination initiatives)పై గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ప్రసంగించారు. తెలంగాణ గిరిజన ప్రజల్లో పోషకాహార లోపాన్ని గుర్తించేందుకు చేపట్టిన పైలెట్ ప్రాజెక్ట్ గురించి తమిళసై వివరించారు.

Governor tamilisai speech on Neutrition Problem in Governors LGs conference

author img

By

Published : Nov 11, 2021, 8:06 PM IST

Updated : Nov 11, 2021, 8:11 PM IST

గిరిజన అభివృద్ధి, ఆరోగ్య సంబంధిత అంశాల((tamilisai speech on Health & vaccination initiatives))పై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో ప్రసంగించారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో 51వ గవర్నర్ల సదస్సు(51st conference of governors and lieutenant governors) జరిగింది. ఈ సదస్సుకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ అధ్యక్షత వహించారు. గవర్నర్​లు, లెఫ్టినెంట్ గవర్నర్​ల సదస్సులో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, అమిత్​షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన ప్రజల్లో పోషకాహార లోపాన్ని గుర్తించేందుకు ఎన్​ఐఎన్, ఈఎస్​ఐ మెడికల్ కళాశాల, ఇండియన్ రెడ్​క్రాస్ సొసైటీలతో కలిసి గవర్నర్ చేపట్టిన పైలెట్ ప్రాజెక్ట్ గురించి తమిళసై వివరించారు.

ఆరుగురిలో తమిళిసై ఒకరు..

ఆదిలాబాద్, భద్రాద్రి, నగర్ కర్నూల్ జిల్లాల్లో గవర్నర్ ఈ ప్రాజెక్టుని చేపట్టిన విషయం తెలిసిందే. ఇక ఇందులో భాగంగా ఆయా జిల్లాల్లో గిరిజనుల్లో పోశాఖహార సమస్యలపై అధ్యాయనం చేయనున్నారు. వీటితో పాటు.. కొవిడ్ సమయంలో ప్రజలకు చేరువయ్యేందుకు హైదరాబాద్ రాజ్​భవన్, పుదుచ్చేరిలో చేపట్టిన కార్యక్రమాల గురించి గవర్నర్ వివరించారు. ఈ సదస్సులో ప్రసంగించేందుకు మొత్తం ఆరుగురు గవర్నర్​లు ఎంపిక కాగా అందులో తమిళసై సౌందర రాజన్ ఒకరు.

Governor tamilisai speech on Neutrition Problem in Governors LGs conference
51వ గవర్నర్ల సదస్సు

గవర్నర్లపై రాష్ట్రపతి ప్రశంసలు..

ప్రజలకు, ప్రభుత్వానికి ఓ స్నేహితుడిగా, తత్వవేత్తగా, మార్గదర్శిగా గవర్నర్‌లు ఉంటారని రాజ్యాంగ నిర్మాతలు భావించినట్లు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ తెలిపారు. గవర్నర్లు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని, ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని రామ్​నాథ్ కోవింద్ సూచించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం గవర్నర్లు కట్టుబడి ఉండాలని కోరారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కరోనాపై పోరులో గవర్నర్లు చురుకుగా పనిచేశారు. అద్భుత సహకారం అందించారు' అని రాష్ట్రపతి ప్రశంసించారు. కరోనా యోధులు అంకితభావంతో పని చేశారని కొనియాడారు​. పరిమిత వనరులు ఉన్నప్పటికీ కరోనాపై భారత్​ గొప్ప పోరాటం సాగించిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు అండగా నిలిచిందని గుర్తు చేశారు.

ఇదీ చూడండి:

Last Updated : Nov 11, 2021, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.