ETV Bharat / city

నవంబర్​ వరకు అప్రమత్తంగా ఉండండి: లోకేశ్​కుమార్​

గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో వ్యాధుల నివారణపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేశ్​​కుమార్​ ఆదేశించారు. గతంలో డెంగీ, మలేరియా కేసులు అత్యధికంగా నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు.

author img

By

Published : Sep 7, 2019, 8:52 PM IST

నవంబర్​ వరకు అప్రమత్తంగా ఉండండి: లోకేశ్​కుమార్​
నవంబర్​ వరకు అప్రమత్తంగా ఉండండి: లోకేశ్​కుమార్​
గ్రేట‌ర్ హైదరాబాద్‌ పరిధిలో మ‌లేరియా, డెంగీ వ్యాధుల నివార‌ణ‌కు చైత‌న్య కార్యక్రమాలు నిర్వహించాల‌ని కమిషనర్​ లోకేశ్​ ​కుమార్ ఆదేశించారు. న‌వంబ‌ర్ నెల వ‌ర‌కు దోమ‌ల ద్వారా వ్యాధులు ప్రబ‌లే అవ‌కాశం ఉంద‌న్నారు. జీహెచ్​ఎంసీ కార్యాలయంలో అధికారులతో కమిషనర్​ సమావేశమయ్యారు.

ఆ ప్రాంతాలపై దృష్టిపెట్టండి

మ‌లేరియా, డెంగీ కేసులు అధికంగా న‌మోదయ్యే హ‌య‌త్‌న‌గ‌ర్‌, మ‌ల‌క్‌పేట్‌, చాంద్రాయ‌ణ‌గుట్ట‌, చార్మినార్‌, రాజేంద్రన‌గ‌ర్‌, మెహిదీప‌ట్నం, కార్వాన్‌, అంబ‌ర్‌పేట్‌, మూసాపేట్‌, కుత్బుల్లాపూర్ త‌దిత‌ర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సాధించాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో దోమల నివారణ స్ప్రేయింగ్ చేప‌ట్టాలని, నీటి నిల్వలు ఉండ‌కుండా చ‌ర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అవగాహన కల్పించాలి

ఓవ‌ర్‌హెడ్ ట్యాంక్‌లు, సంప్​లు, న‌ల్లా గుంత‌లతో పాటు డ్రమ్‌లు, టైర్లలో నీటి నిల్వల‌ను పూర్తిగా తొల‌గించాల‌న్నారు. న‌గ‌రంలోని 1800 పాఠ‌శాల‌ల విద్యార్థులకు అంటు వ్యాధుల నివార‌ణ‌పై అవగాహన కార్యక్రమాల‌ను నిర్వహించాల‌ని ఆదేశించారు. జీహెచ్ఎంసీ ఎంట‌మాల‌జీ విభాగం ప్రతిరోజు క‌నీసం 150 కాల‌నీలు, బ‌స్తీల్లో ఫాగింగ్ నిర్వహించాల‌ని కమిషనర్​ లోకేశ్​ ​కుమార్ సూచించారు.

ఇవీ చూడండి: ఆరోగ్య గ్రామాల ఏర్పాటే లక్ష్యం: హరీశ్ రావు

Intro:Tg_Hyd_35_05_Gurupujotsvam_Vo_Ts10002
note: script FTP dwara pampinchadam jarigindi

Body:Tg_Hyd_35_05_Gurupujotsvam_Vo_Ts10002

Conclusion:Tg_Hyd_35_05_Gurupujotsvam_Vo_Ts10002
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.