ETV Bharat / city

మళ్లీ కొహెడకే గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ - తాత్కాలికంగా పండ్ల మార్కెట్ తరలింపు

కరోనా విజృంభిస్తున్నందున... ఎట్టకేలకు హైదరాబాద్‌లోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను మళ్లీ తాత్కాలికంగా తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కొహెడలో కార్యకలపాలు ప్రారంభించేందుకు మార్కెటింగ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భౌతిక దూరం పాటించాలన్న నిబంధనలు దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా మార్కెట్​ను తరలించాల్సిందేనని నిర్ణయించింది.

gaddi annaram fruit market shift temporarily to koheda
గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ మళ్లీ కొహెడకే
author img

By

Published : Jul 9, 2020, 9:51 AM IST

గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ మళ్లీ కొహెడకే తరలింపు

కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. దేశంలో ప్రధాన వ్యవసాయ మార్కెట్లలో కరోనా విజృంభణ నేపథ్యంలో హైదరాబాద్ గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను తాత్కాలికంగా కొహెడకు తరలించేందుకు మార్కెటింగ్ శాఖ రంగం సిద్ధం చేసింది. కేంద్ర, రాష్ట్ర సర్కార్లు జారీ చేసిన లాక్‌డౌన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తపేటలోని గడ్డిఅన్నారం మార్కెట్‌ కార్యాలయం ఆవరణలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వీరమళ్ల రాంనర్సింహగౌడ్ అధ్యక్షతన పాలకవర్గం సమావేశంలో నిర్ణయించారు.

వాడివేడీ చర్చ

పండ్ల మార్కెట్ తాత్కాలిక తరలింపు ప్రతిపాదనపై అంశంపై పాలకవర్గం సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ కష్టకాలంలో తమకు సహకరిస్తే... భవిష్యత్​లో మీ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని అధికారులు భరోసా కల్పించే యత్నం చేశారు. అయినా... ఏకాభిప్రాయం కుదరక ఒక దశలో మార్కెట్‌ కమిటీ ఛైర్మన్, కార్యదర్శి, కమీషన్ ఏజెంట్ల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. వాడివేడిగా చర్చలు సాగాయి. రెండు మూడేళ్లు ఆలస్యమైనా ఫర్వాలేదు. కానీ పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పిస్తేనే కొహెడ వెళ్లేందుకు సిద్ధమని వ్యాపారులు తెగేసి చెప్పారు.

కరోనా నేపథ్యంలో మార్చి 23 నుంచి దేశవ్యాప్తంగా... ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ మార్కెట్లన్నీ మూతపడ్డాయి. ఇక తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మార్కెటింగ్ శాఖకు మార్గనిర్ధేశం చేస్తూ వచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేరకు మామిడి, బత్తాయి సీజన్ దృష్ట్యా... రైతులకు ఇబ్బందులు కలుగకుండా గడ్డిఅన్నారం నుంచి కొహెడకు తరలించారు. పర్యవేక్షణ లేక ఆ తాత్కాలిక ఏర్పాట్లు, షెడ్లన్నీ తూతూమంత్రంగా చేపట్టారు.

ప్రారంభానికి ముందే కూలింది

అధికారికంగా ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందు మే 4న కురిసిన వర్షం, భారీ గాలుల తీవ్రకు షెడ్లు కుప్పకూలాయి. 44 మంది గాయపడ్డారు. ఒకరకంగా చెప్పాలంటే పెను ప్రమాదం తప్పింది. ఈ లోగా రైతులు ఇబ్బంది పడకుండా కొహెడ నుంచి మళ్లీ గడ్డిఅన్నారం, ఉప్పల్‌లో మామిడి, బత్తాయి విక్రయాలకు ఆటంకం లేకుండా మార్కెటింగ్ శాఖ చర్యలు తీసుకుంది. బొప్పాయి, ద్రాక్ష, దానిమ్మ, పుచ్చ క్రయ, విక్రయాలు సరూర్‌నగర్ రైతుబజారు వెనుక వీఎం హోమ్స్‌కు మార్చారు. ఇప్పటికే... ఒకసారి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకున్న తాము మళ్లీ వెళ్లబోమని కమీషన్ ఏజెంట్లు తెలిపారు.

హక్కు కల్పిస్తాం

కేసులు రోజురోజుకు ఎక్కువ అవుతుండటం వల్ల... బోయినపల్లిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్​ కూరగాయల మార్కెట్, గుడిమల్కాపూర్‌లో ఇంద్రారెడ్డి పూల మార్కెట్, హైదరాబాద్ ఉల్లిగడ్డ మార్కెట్ కొన్ని రోజులపాటు మూసివేసి తర్వాత పునఃప్రారంభించారు. ఆ భయంతో కనీసం ఒక మాసం కొహెడలో తాత్కాలికంగా మార్కెట్‌ కార్యకలాపాలు సాగేలా సహకరించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం విజ్ఞప్తి చేసినా వ్యాపారుల నుంచి సానుకూల స్పందన కనిపించలేదు. వ్యాపారుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మేలు జరిగేలా కృషి చేయడమే కాకుండా ప్రత్యేకించి కొత్తగా ఏర్పాటు కాబోయే కొహెడ మార్కెట్‌లో యాజమాన్య హక్కు కల్పిస్తామంటూ నచ్చిజెప్పింది. 1986లో జాంబాగ్ నుంచి ఆ హక్కు గురించి ఎవరూ మాట్లాడలేదు... ఇప్పటికైనా ఆ హక్కు ఇప్పిస్తామని భరోసా ఇచ్చింది. మూడు గంటలపాటు విస్తృతంగా చర్చించినప్పటికీ వ్యవసాయ మార్కెట్ కమిటీ, కమీషన్ ఏజెంట్స్ వెల్‌ఫేర్ అసోసియేషన్లు, ఫ్రూట్ మర్చంట్స్ అసోసియేషన్, హమాలీ అసోసియేషన్ మధ్య పరస్పర అవగాహన కుదరలేదు.

సంక్షేమం కోసం సహకరించాలి

దేశంలోనే పెద్దదైన దిల్లీ ఆజాద్​ పూర్​ మండీ, తమిళనాడు కోయంబేడు మార్కెట్లు ఎక్కువ రోజులు మూసివేసినా... గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు మాత్రం రెండు మూడు రోజులే సెలవు ప్రకటించారు. తాజాగా ఇక అనివార్యంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మార్కెట్‌ కొహెడకు తరలింపు అంశం తెరపైకి వచ్చింది. జూన్ 30, ఈ నెల 4న భేటీలు జరిగినా వర్తకులు మొండిపట్టుగా ఉండటం వల్ల ఇదే పరిస్థితి కనిపించింది. జీహెచ్‌ఎంసీలో కేసుల దృష్ట్యా గడ్డిఅన్నారం మార్కెట్‌కు సెలవు ప్రకటించేందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. ప్రత్యామ్నాయంగా ఈ నెల 13 నుంచి కొహెడలో తాత్కాలిక మార్కెట్ కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ లోగా గడ్డిఅన్నారం మార్కెట్లో శానిటైజేషన్, మరమ్మత్తులు చేపట్టనుంది. ఈ నెల 15 నుంచి ఆపిల్ సీజన్ ప్రారంభవుతున్నందున... తరలింపు నిర్ణయం తీసుకుంది. రైతులు, వర్తకులు, వినియోగదారులు, హమాలీలే కాదు ఆ కుటుంబాల సంక్షేమం కోణంలో వ్యాపారులు సహకరించాలని ఏఎంసీ పాలకవర్గం ఛైర్మన్ రాంనర్సింహగౌడ్ సూచించారు.

ఇదీ చూడండి: కోహెడకు తాత్కాలికంగా పండ్లమార్కెట్​ తరలింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.