ETV Bharat / city

అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాలకు నిధుల విడుదల

author img

By

Published : Jun 25, 2021, 1:13 PM IST

Release of salaries of temple priests, release of salaries of temple employees, priests
ఆలయ అర్చకుల వేతనాలు విడుదల, ఆలయ ఉద్యోగుల వేతనాలు విడుదల, అర్చకులు

12:41 June 25

అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాలకు నిధుల విడుదల

రాష్ట్రంలో అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాలకు నిధుల విడుదలయ్యాయి. రెండో త్రైమాసికానికి సంబంధించి రూ.30 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర సర్కార్ పరిపాలనా అనుమతులు ఇచ్చింది. నిధుల విడుదలపై దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

బడ్జెట్​లో కేటాయించిన 120 కోట్ల రూపాయలకు గాను మొదటి త్రైమాసికానికి సంబంధించి గతంలోనే 30 కోట్ల రూపాయలు విడుదల చేయగా... తాజాగా రెండో త్రైమాసికానికి సంబంధించి మరో 30 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 

దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ తెలిపింది. అర్చకులు, ఆలయ ఉద్యోగుల అభివృద్ధికి కేసీఆర్ సర్కార్ కట్టుబడి ఉందని వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.