ETV Bharat / city

స్వాతంత్య్ర వజ్రోత్సవాలు, నేడు రాష్ట్రవ్యాప్తంగా పండ్లు, మిఠాయిల పంపిణీ - విద్యార్థులకు గాంధీ సినిమా ఉచితంగా ప్రదర్శన

Independence Diamond celebrations స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పండ్లు, మిఠాయిల పంపిణీ జరగనుంది. ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, జైళ్లలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేయనున్నారు. దేశంలోనే తొలిసారిగా 20లక్షలకుపైగా విద్యార్థులకు గాంధీ సినిమా ఉచితంగా ప్రదర్శిస్తున్నారు.

Fruits and sweets will be distributed today

author img

By

Published : Aug 19, 2022, 7:44 AM IST

Independence Diamond celebrations : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా... రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ పండ్లు, మిఠాయిల పంపిణీ జరగనుంది. ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, జైళ్లలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేయనున్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా 552 సినిమా హాళ్ళ ద్వారా దాదాపు 20లక్షలకు పైగా విద్యార్థులకు గాంధీ సినిమా ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. ఇంతపెద్ద స్థాయిలో ఉచితంగా ప్రదర్శించడం దేశంలోనే ఇది మొదటిసారి.

గాంధీ సినిమా ప్రదర్శనపై ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్‌ అధికారులు... రాష్ట్ర అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా రవీంద్రభారతిలో అఖిల భారత నృత్యోత్సవం నిర్వహిస్తున్నారు. తొలిరోజైన గురువారం భారతీయ సంప్రదాయ నృత్యాంశాలైనా... కూచిపూడి, పేరిణి, ఆంధ్రనాట్యం, కథక్‌, మోహినియాట్టం నృత్యరీతులను ప్రదర్శించారు. ఇవాళ... ఒడిస్సీ, మణిపురి నృత్యం, పేరిణి, సత్రియ, మోహినీ భస్మాసుర నృత్యాలు ప్రదర్శించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.