ETV Bharat / city

'వాటిని అర్థం చేసుకుని ప్రభుత్వ పథకాలను రూపొందించారు' - సీఎం జగన్​ వార్తలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఫ్రెంచ్‌–అమెరికన్‌ ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత ఎస్తెర్‌ ఢఫ్లో కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో సీఎస్ సమీర్ శర్మ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించేందుకు ప్రభుత్వంతో కలిసి కృషి చేయనున్నట్లు ఎస్తేర్‌ వెల్లడించారు.

'వాటిని అర్థం చేసుకుని ప్రభుత్వ పథకాలను రూపొందించారు'

author img

By

Published : Mar 29, 2022, 1:45 PM IST

నోబెల్‌ బహుమతి గ్రహీత, ప్రఖ్యాత ఆర్థికవేత్త ఎస్తర్‌ డఫ్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆమె సోమవారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, మహిళా సాధికారత అంశాల్లో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సీఎం వివరించారు. అనంతరం ఆమెకు జ్ఞాపికను అందజేసి సన్మానించారు.

'వాటిని అర్థం చేసుకుని ప్రభుత్వ పథకాలను రూపొందించారు'

ఈ భేటీ అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మతో ఎస్తర్‌ డఫ్లో బృందం భేటీ అయ్యింది. సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాలు, వాటిని చేరుకునేందుకు ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలను సీఎస్‌ ఆమెకు వివరించారు. పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకుని.. వాటిని అర్థం చేసుకుని ప్రభుత్వ పథకాల్ని రూపొందించారంటూ ఆమె ముఖ్యమంత్రిని కొనియాడారని సీఎం కార్యాలయం ప్రకటనలో వివరించింది.

‘డీబీటీ పథకాల్లో ఎక్కువ భాగం నేరుగా మహిళల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. ఇళ్ల కేటాయింపులో మహిళలకే ప్రాధాన్యమిస్తున్నారు. తద్వారా మహిళా సాధికారతతో పాటు కుటుంబం సుస్థిరమవుతుంది. సుస్థిర ఆర్థిక ప్రగతికి నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల అమలు, వాటి ప్రభావంపై అధ్యయనం చేసి సలహాలు ఇవ్వాలని సీఎం కోరారు. పేదరిక నిర్మూలన, ప్రజల జీవన స్థితిగతులు పెంచే అంశాలతో పాటు వివిధ అంశాలపై భవిష్యత్తులో ఏపీతో కలిసి పనిచేస్తాం’ అని ఆమె తెలిపారని సీఎం కార్యాలయం ప్రకటనలో వివరించింది. ‘ఎస్తర్‌ డఫ్లో.. ది అబ్దుల్‌లతీఫ్‌ జమీల్‌ పావర్టీ యాక్షన్‌ ల్యాబ్‌లో డైరెక్టర్‌. సహ వ్యవస్థాపకురాలు’ అని తెలిపింది.

ఇదీ చదవండి: ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ దిశగా ప్రభుత్వం కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.