ETV Bharat / city

ఉచిత నీటి హామీ అమలుపై జలమండలి దృష్టి

ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన.. ఉచిత నీటి అంశంపై ఇప్పటికే ప్రజల్లో చర్చ జరుగుతోంది. చాలా నల్లాలకు మీటర్లే లేవు ఈ పథకం అమలు చేయాల్సి వస్తే పరిస్థితి ఏమిటనే దానిపై జలమండలి దృష్టిపెట్టింది.

Jalamandali focus on free water guarantee implementation
ఉచిత నీటి హామీ అమలుపై జలమండలి దృష్టి
author img

By

Published : Dec 3, 2020, 8:31 AM IST

గ్రేటర్ ఎన్నికల్లో.. భాగ్యనగర వాసులకు 20వేల లీటర్ల ఉచిత నీరు అందిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ హామీ అమలుపై జలమండలి దృష్టి సారించింది. ఏ విధంగా అమలు చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతోంది.

అక్కడ మీటరుంటేనే..

దిల్లీలో సుమారు 14 లక్షల మంది ఉచిత నీటిని పొందుతున్నారు. మీటర్లు పెట్టుకున్న వారికే 20 వేల లీటర్లు సరఫరా చేస్తున్నారు. ప్రతి నల్లాకు మీటరు తప్పనిసరి చేయడంతో నీటి పొదుపు పెరిగింది.

లెక్క తీస్తున్నారు:

మన నగరంలో అర్హులు ఎంత మంది ఉన్నారో ఆరా తీస్తున్నారు. అపార్ట్‌మెంట్లను పరిగణనలోకి తీసుకుంటే 9 లక్షల మంది ఉంటారు. ప్రతి ఫ్లాటును కుటుంబంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం డొమెస్టిక్‌ కేటగిరీలో నెలకు కనీసం 15 వేల లీటర్లకు, ఫ్లాటుకు 9 వేల లీటర్లకు జలమండలి బిల్లులు వసూలు చేస్తోంది. 20 వేల లీటర్ల వరకు ఉచితంగా ఇచ్చినా వీళ్లంతా లబ్ధిపొందనున్నారు.

మన వద్ద సమస్య ఏంటి?

ప్రతి వేయి లీటర్లను సేకరించి, నగరానికి తరలించడానికి జలమండలి రూ.47 వరకు ఖర్చు చేస్తోంది. వినియోగదారులకు కేవలం రూ.10కే అందిస్తోంది. అదే మురికివాడల్లో రూ.7కే ఇస్తోంది. మిగతా నష్టాన్ని క్రాస్‌ సబ్సిడీ ద్వారా పూడ్చుకుంటోంది.

* ఖరీదైన నీటిని మీటర్ల లేకుండా సరఫరా చేస్తే వృథా అయ్యే అవకాశం ఉంది.

* బిల్లులు చెల్లించాల్సిన పనిలేదని జలమండలి అనుమతి లేకుండానే నల్లాలు తీసుకునే ప్రమాదం ఉంది.

* పక్కా ఒక విధానం లేకపోతే వినియోగదారుల్లో బాధ్యత రాహిత్యం పెరుగుతుందని నిపుణుల అభిప్రాయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.