ETV Bharat / city

ఇంటింటా కన్నీళ్లు.. ఇంకేందుకు ఎన్నాళ్లో!

author img

By

Published : Oct 30, 2020, 10:30 AM IST

మురుగు మేట వేసి దుర్వాసనతో కూడిన పరిసరాలు.. పనికి రాకుండాపోయిన వస్తువులు.. పాడైన వాహనాలు.. బలహీనంగా మారిన గోడలు.. కళ చెదిరిన ఇళ్లు.. ఇలా వరద ప్రభావిత ప్రాంతాల్లో కళ్లు చెమర్చే పరిస్థితులు తారసపడుతున్నాయి. పునరావాస కేంద్రాలు, బంధువుల ఇళ్ల నుంచి సొంతింటికి చేరుతున్న బాధితులు తమ నివాసాలు చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. శుభ్రం చేసుకొనే పనిలో పడ్డారు. వీధుల్లో మురుగునీరు ఉండడంతో కాలు బయటపెట్టలేకపోతున్నారు.

flood victims of Hyderabad
వరద బాధితుల సమస్యలు

బండ్లగూడ చెరువు ముంపునకు గురైన అయ్యప్పనగర్‌, మల్లికార్జుననగర్‌ ఫేజ్‌-1, 2; టోలిచౌకిలోని నదీంకాలనీ, చాంద్రాయణగుట్టలోని హఫీజ్‌బాబానగర్‌ ప్రాంతాల్లో ఇప్పటికీ కొన్ని ఇళ్లు మురుగు నీటిలో నానుతున్నాయి. ఆ ప్రాంతాల్లో ‘ఈటీవీ భారత్’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది.

నాకు నలుగురు పిల్లలు. జిరాక్సు సెంటర్‌ నడుపుతున్నా. దుకాణంలోకి వరద చేరి రూ.1.50లక్షల విలువైన సామగ్రి పాడైపోయింది. సమీపంలోని ఇంటినీ వరద ముంచెత్తింది. రూ.2.5లక్షల వస్తువులు కొట్టుకుపోయాయి. కుటుంబ సభ్యులను బంధువుల ఇంటికి పంపించాను.

- మహ్మద్‌ అలీముద్దీన్‌, నదీంకాలనీ

హఫీజ్‌బాబానగర్‌లోని ఉమర్‌ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌ పక్కనే ఇళ్లలో నాలుగు పేద కుటుంబాలున్నాయి. గుర్రం చెరువుకు గండి పడి ఈ ఇళ్లలోకి భారీగా వరద చేరింది. 40 అడుగుల గోడ కూలింది. కట్టుబట్టలతో డాబాపైకి చేరారు. వంటసామగ్రి సహా అన్నీ కొట్టుకుపోయాయంటూ బాధితులు అమ్రీన్‌, యూకుబ్‌ తెలిపారు. నాలుగు రోజులుగా కుమార్తె కడుపు నొప్పితో బాధపడుతోందని వాపోయింది.

‘మూడు వారాలుగా ఇంటికి దూరమయ్యాం. నీరు తగ్గడంతో వచ్చి శుభ్రం చేసుకుంటున్నాం. రెండు రోజులుగా శుభ్రపరుస్తున్నా ఇంకా మురుగు పోవడం లేదు. రెండు ద్విచక్రవాహనాలు పాడయ్యాయి. వస్తువులను తుక్కు కింద బయటపడేశాం. దాదాపు రూ.2-3లక్షల సామగ్రి పాడైంది. దుస్తులన్నీ దుర్వాసన వస్తున్నాయి. అన్నీ కొత్తవి కొనుక్కోవాల్సిందే.

- బండ్లగూడ అయ్యప్పకాలనీకి చెందిన నవీన్‌

నదీం కాలనీ.. కోలుకునేది ఎపుడనీ?

నదీంకాలనీతోపాటు పక్కనే ఉన్న నీరజకాలనీ పరిసరాల్లో 1000 కుటుంబాలు వరదల్లో చిక్కుకున్నాయి. వీధుల్లో ఇప్పటికీ బురద నీరు ఉండడంతో అంటువ్యాధుల భయం పట్టుకుంది. ఎప్పటికి కోలుకుంటామనే నిర్వేదం బాధితుల్లో కనిపించింది. చాలీచాలని తిండితో గడుపుతున్నారు. వృద్ధులను బంధువుల ఇళ్లకు పంపారు. వాహనాలకు మరమ్మతులు చేయించలేక రోడ్లపై వదిలేశారు. సగటున ప్రతి ఇంట్లో రూ.లక్ష - రూ.2.50 లక్షల నష్టం జరిగి ఉంటుందని అంచనా.

హఫీజ్‌బాబానగర్‌లో..

గుర్రం చెరువుకు గండి పడి హఫీజ్‌బాబానగర్‌లో 2000కు పైగా ఇళ్లలోకి వరద చేరింది. సామగ్రి పనికిరాకుండాపోయింది. వారం రోజులపాటు నిరాశ్రయులయ్యారు. బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు. కొన్ని కుటుంబాలు స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే ఆహారంతోనే గడుపుతున్నాయి.

ప్రజలకు బల్దియా కమిషనర్‌ పిలుపు

ముంపు ప్రభావిత ప్రాంతాల్లో వ్యర్థాలను వేగంగా తొలగిస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ గురువారం ప్రకటించారు. సమస్య పరిష్కారం కాకపోతే ప్రజలు బల్దియా అధికారులను సంప్రదించాలని సూచించారు.

బండ్లగూడ అయ్యప్పకాలనీ, పరిసరాల్లోని మూడు కాలనీల్లోని ఇళ్లు రోజుల తరబడి నీళ్లలో ఉండడంతో వస్తువులన్నీ పాడయ్యాయి. వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసిన గృహోపకరణాలను తుక్కు కింద పడేస్తున్న పరిస్థితి. వాహనాల ఇంజిన్లలోనూ నీరు చేరింది. రూ.15-25 వేల మధ్య వెచ్చిస్తే గానీ బాగయ్యే పరిస్థితి లేదు. ప్రతి ఇంట్లో రూ.2-3లక్షల వరకు నష్టపోయినట్లు బాధితులు వాపోతున్నారు. ఆయా కాలనీల్లో సుమారు 550 వరకు ఇళ్లు ఉన్నాయి. ఈ లెక్కన సుమారు రూ.15కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.