ETV Bharat / city

తగ్గిన రైతు మరణాలు! రైతు బీమా పథకంలో వెల్లడి - రైతు బీమా పథకం

రాష్ట్రంలో అన్నదాతల మరణాలు తగ్గాయి. గతేడాది సగటున 48 మంది మరణించగా... ఈ ఏడాది 36 మంది మృతిచెందినట్లు రైతు జీవిత బీమా పథకం పరిహారంలో వెల్లడైంది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి 28,480 మంది రైతులు మరణించారు.

FARMER
FARMER
author img

By

Published : Jun 21, 2020, 12:22 PM IST

రాష్ట్రంలో రైతుల మరణాలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. గతేడాది రోజుకు సగటున 48 మంది కన్నుమూయగా ఈ ఏడాది 36 మంది మరణించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో 18 నుంచి 59 ఏళ్లలోపు రైతుల కోసం రైతు జీవిత బీమా పథకాన్ని వ్యవసాయ శాఖ అమలుచేస్తోంది. ఈ పథకం కింద నమోదైన రైతుల తరఫున ప్రీమియం సొమ్మును ఎల్‌ఐసీకి చెల్లిస్తోంది. రైతు ఏ కారణంతో కన్నుమూసినా అతని నామినీకి 10 రోజుల్లోగా రూ.5 లక్షల పరిహారాన్ని సంస్థ అందజేయాలనే నిబంధన ఉంది.

ఈ పథకాన్ని 2018 ఆగస్టు 14న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తొలి ఏడాది 2019 ఆగస్టు 13న ముగిసింది. ఆ ఏడాదిలో మొత్తం 17,519 మంది రైతులు కన్నుమూశారని ఎల్‌ఐసీ వెల్లడించింది. ఈ ఏడాది (2019 ఆగస్టు 14 నుంచి 2020 ఆగస్టు 13)లో ఈనెల 10 వరకూ 10,961 మంది కన్నుమూశారు. మొత్తం 665 రోజులకు 28,480 మంది రైతులు కన్నుమూయడంతో వారి కుటుంబాలకు రూ.1424 కోట్ల పరిహారాన్ని అందజేసినట్లు ఎల్‌ఐసీ వ్యవసాయశాఖకు నివేదించింది.

ఇదీ చదవండి: కరోనాకు డ్రగ్​ రిలీజ్​- ఒక్కో టాబ్లెట్ రూ.103

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.