ETV Bharat / city

మద్యం దుకాణాలు తెరవబడును.. నకిలీ ఉత్తర్వులు

శనివారం మధ్యాహ్నం మూడు గంటల పాటు మద్యం దుకాణాలు తెరవబడును అనే అసత్య వార్త ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఆ ఉత్తర్వు నకిలీదని ప్రజలు విశ్వసించవద్దని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

author img

By

Published : Mar 29, 2020, 5:53 AM IST

fake orders issued on wines shops opening
మద్యం దుకాణాలు తెరవబడును.. నకిలీ ఉత్తర్వులు

లాక్​డౌన్​ కొనసాగుతున్నందున రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల దుకాణాలు తప్ప మిగతా అన్నీ మూతపడ్డాయి. కానీ శనివారం మధ్యాహ్నం 2 నుంచి ఐదున్నర వరకు వైన్స్​లు తెరవనున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ఓ నకిలీ ఉత్తర్వు సర్క్యూలేట్​ అయింది. ఎక్సైజ్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ డీసీపీ రాజేంద్ర సైబర్​ క్రైమ్​ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఆబ్కారీ శాఖ నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని వైన్స్​ డీలర్స్​ అసోసియేషన్​ అధ్యక్షుడు వెంకటేశ్వర రావు తెలిపారు. తమ శాఖ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని, సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న ఆర్డర్​ కాపీ నకిలీదని తెలంగాణ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్, కమిషనర్ సర్ఫరాజ్​ అహ్మద్ తెలిపారు. దానిని సృష్టించిన వారిని కఠినంగా శిక్షించాలని సీసీఎస్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: క్వారంటైన్‌ వ్యక్తులు బయట తిరిగితే జైలుకే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.