ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా మైదకూరు మండలం శ్రీరాంనగర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బలాన్ని ప్రసాద్ కర్రసాములో ఆరితేరాడు. విద్యార్థులకు నేర్పిస్తే బాగుంటుందని భావించారు. నో బ్యాక్ డే రోజున ఇద్దరు విద్యార్థులకు కర్రసాము మెళకువలు నేర్పించారు. నాలుగైదు తరగతుల్లో 20 మంది విద్యార్థులు ఉండగా మరో 13 మంది ముందుకొచ్చారు. విద్యార్థులంతా పోటీపడి మరీ కర్రను గిర్రున తిప్పుతున్నారు. బాలురతో పాటు బాలికలు కూడా సత్తా చాటుతున్నారు. కేవలం మూడు వారాల్లోనే ప్రావీణ్యం సంపాదించారు.
ఇదీ చదవండి: కోట్లా లంబోదరుడికి 56 వేల లడ్డూల నైవేద్యం