1. 'కేసీఆర్ అంటేనే ఇంటి పాలన'
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా త్రిపురారం మండలంలో కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పర్యటించారు. భాజపా అభ్యర్థి రవికుమార్‌నాయక్ తరఫున ప్రచారంలో పాల్గొన్న మంత్రి... తెరాస ఓ కుటుంబ పాలన అని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. పదిమందికి తీవ్రగాయాలు!
జాతీయ రహదారి-44పై లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. అంబులెన్స్ సిబ్బంది అంత్యక్రియలు
మెట్పల్లిలో కరోనాతో చనిపోయినవారికి అంబులెన్స్ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. వారం రోజులుగా చికిత్స పొందుతూ పట్టణవాసి చనిపోయారు. సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. బంగాల్ : మధ్యాహ్నం వరకు 53% పోలింగ్
బంగాల్ నాలుగో విడత ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు.. ఓటింగ్‌లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 1.37 గంటల వరకు 52.89 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'భాజపా విజయాన్ని అడ్డుకోలేరు'
కూచ్ బెహార్‌లో జరిగిన కాల్పుల ఘటనపై విచారం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. బంగాల్‌లోని సిలిగురిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఎన్నికల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడటం ద్వారా బంగాల్‌లో భాజపా విజయాన్ని తృణమూల్ కాంగ్రెస్ అడ్డుకోలేదని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. పూజల పేరిట అత్యాచారం
అత్యాశకు పోయి తన సొంత కుమార్తె జీవితాన్ని నాశనం చేసిందో మహిళ. క్షుద్ర పూజల ద్వారా రూ.కోట్లు రప్పిస్తానని నమ్మించిన మాంత్రికున్ని తన కూతురిపై అత్యాచారం చేసేందుకు అనుమతించింది. అతని చెర నుంచి తప్పించుకున్న యువతి.. సంవత్సరకాలంగా ఈ నరకాన్ని అనుభవిస్తున్నట్లు పోలీసులుకు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. 'కేంద్ర వైఫల్యమే వ్యాప్తికి కారణం'
కరోనా రెండో దశకు కారణం కేంద్ర వైఫల్యాలే అని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. వ్యాక్సినేషన్ విస్తృతం చేయడం సహా వలస కార్మికులకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. మళ్లీ మిడతల దండయాత్ర!
ఆఫ్రికాలోని కెన్యాలో మిడతల దండు స్థానికులను హడలెత్తిస్తోంది. కరవు, కరోనా కారణంగా ఇప్పటికే ఆ దేశం తీవ్రంగా నష్టపోగా.. ఇప్పుడు వీటి వ్యాప్తి కట్టడి చేయకపోతే భారీ నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. దిల్లీతో-ధోనీ ధనాధన్!
ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమయ్యాయి చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్. ఈ క్రమంలోనే ఇరుజట్లు ప్రాక్టీస్‌లో బిజీ అయ్యాయి. చెన్నై సారథి ధోనీ కూడా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది ఫ్రాంచైజీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. 'మేజర్'కు ముహూర్తం ఖరారు
ముంబయిలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'మేజర్'. అడివి శేష్, సయీ మంజ్రేకర్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.