1. మధ్యాహ్నం వరకు పోలింగ్ శాతం
మ.2 గం. వరకు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి 39.09 శాతం పోలింగ్ నమోదు కాగా.. నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి మధ్యాహ్నం 2 గంటల వరకు 21.65 శాతం పోలింగ్ నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. వైకాపా జోరు
అనంతపురం కార్పొరేషన్‌లో ఇప్పటి వరకు వైకాపా 40, స్వతంత్ర అభ్యర్థి ఒక్కస్థానంలో గెలుపొందారు. తాడిపత్రి మున్సిపాలిటీ తెదేపా కైవసం చేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 'వినియోగించుకోవడం శుభపరిణామం'
హైద్రాబాద్ గాంధీనగర్‌లో భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ స్వేచ్ఛగా ఓటు వేయడం శుభపరిణామని ఆయన అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. నలుగురు దుర్మరణం
సంగారెడ్డి జిల్లా అందోలు మండలం అల్మాయిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన కంటైనర్... ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. పవన్ కల్యాణ్ గుస్సా
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి వాణీదేవికి మద్దతిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పీవీ కుమార్తెకు మద్దతు ఇవ్వాలన్న నేతల అభిప్రాయాన్ని గౌరవిస్తున్నానని ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. 'ప్రమాదం వల్లే గాయం!'
మమతా బెనర్జీపై దాడి జరిగిందన్న వాదనల్ని కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఎన్నికల పరిశీలకులు, బంగాల్ ప్రభుత్వం ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈమేరకు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. 'వారిపై కఠిన చర్యలు!'
క్రిమినల్ కేసుల్లో నకిలీ ఫిర్యాదులను అరికట్టేందుకు మార్గదర్శకాలను రూపొందించాలని కోరుతూ ఓ భాజపా నేత.. సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. అలాంటి తప్పుడు విచారణల వల్ల బాధితులుగా మారిన వారికి పరిహారం చెల్లించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. ఆ ఇన్నింగ్స్‌కు 20 ఏళ్లు
ఈడెన్ గార్డెన్ వేదికగా 2001లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు, అద్భుతమైన మ్యాచ్‌ల్లో ఒకటి. అందుకు కారణం టీమ్ఇండియా క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్‌ల ఇన్నింగ్స్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. క్వాడ్ దేశాధినేతల వ్యాసం!
క్వాడ్ దేశాధినేతలు సంయుక్తంగా వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో వ్యాసం రాశారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛను కాపాడేందుకు కట్టుబడి ఉంటామని అందులో స్పష్టం చేశారు. క్వాడ్ దేశాల మధ్య సహకారం సంక్షోభ సమయంలో ఏర్పడిందని, ఇది కొనసాగుతుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. భావోద్వేగం.. వీడియో వైరల్
హీరోగా నటించిన రెండో చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు కథానాయుకుడు నవీన్ పొలిశెట్టి. ఆయన ప్రధానపాత్రలో నటించిన 'జాతిరత్నాలు' చిత్రం మార్చి 11న విడుదలై విశేషాదరణ దక్కించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.