ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@9PM

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు.

author img

By

Published : Nov 29, 2020, 8:57 PM IST

టాప్​టెన్​ న్యూస్​@9PM
టాప్​టెన్​ న్యూస్​@9PM

1.ప్రచారం చేస్తే రెండేళ్లు జైలు

గ్రేటర్​ ఎన్నికల ప్రచారం పర్వం ముగిసింది. గడువు తర్వాత ప్రచారం నిర్వహిస్తే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి తెలిపారు. కొవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. పోలింగ్ రోజున సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించినట్టు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. మూగబోయిన మైకులు

సవాళ్లు... విమర్శలు.. ప్రతి విమర్శలతో మారుమోగిన బల్దియా ప్రచారానికి తెరపడింది. హామీలతో హోరెత్తిన మైకులు మూగబోయాయి. ఓటర్లను ఆకట్టుకోవడానికి శాయశక్తుల ప్రయత్నించిన నాయకులు... తుది అంకానికి సిద్ధమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.నిబంధనలు తప్పనిసరి

గ్రేటర్ ఎన్నికలకు జీహెచ్ఎంసీ, రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తోంది. కరోనా నేపథ్యంలో ఈసారి కొవిడ్ నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు మాస్క్​ తప్పనిసరిగా వాడాలని ఎస్ఈసీ స్పష్టం చేసింది. పోలింగ్ సిబ్బంది కరోనా కిట్లు, శానిటైజర్లు.. భౌతిక దూరం పాటించేలా క్యూలైన్​లు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.పటిష్ఠ బందోబస్తు

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్​కు సర్వం సిద్ధమవుతోంది. ఈ తరుణంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల్లో కీలక ఘట్టమైన ఓటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసు ఉన్నతాధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.లిక్కర్​ ఫైట్​

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో అధికార పార్టీ నేతలు లిక్కర్ పంచుతుండగా అడ్డుకున్న తమపై దాడులు చేశారని భాజపా కార్యకర్తలు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. విషయం తెలుసుకున్న డీకే అరుణ మైలార్​దేవ్​పల్లి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.వ్యాక్సిన్​ సన్నద్ధతపై..

కరోనా వ్యాక్సిన్​ కోసం కృషి చేస్తున్న మరో మూడు సంస్థలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం భేటీకానున్నారు. వ్యాక్సిన్​ పురోగతిపై ఆరా తీయనున్నారు. వర్చువల్​గా ఈ సమావేశం జరగనుందని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.ఉత్తర భారతం గజగజ!

వచ్చే రెండు నెలల్లో ఉత్తరాదిలో చలితీవ్రత అధికంగా ఉంటుందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది. మధ్య భారతంలోనూ ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వివరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.కేంద్రం ప్రతిపాదనకు నో..

కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వివిధ రాష్ట్రాల రైతులు చేపట్టిన 'ఛలో దిల్లీ' కార్యక్రమాన్ని కొనసాగించాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి నిర్ణయించింది. చర్చలపై కేంద్రం ప్రతిపాదనలను తిరస్కరించిన సమన్వయ సమితి... డిసెంబర్ 1 నుంచి అన్ని రాష్ట్రాల్లో రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.రెండో వన్డేలోనూ..

సిడ్నీ వేదికగా జరిగిన రెండో వన్డేలోనూ కోహ్లీసేన ఓడిపోయింది. తమ శక్తిమేర పోరాడినప్పటికీ లక్ష్యం పెద్దదిగా ఉండటం వల్ల భారత బ్యాట్స్​మెన్ ఛేదించలేకపోయారు. దీంతో మ్యాచ్​తో పాటు సిరీస్​ను ఆసీస్ గెల్చుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.నాగశౌర్య నయాటైటిల్​ అప్పుడే..

టాలీవుడ్​ యువ హీరో నాగశౌర్య 20వ సినిమా టైటిల్​ నవంబర్​ 30న ప్రకటించబోతున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఈ చిత్రానికి సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.