ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాాంశాలు - తెలుగు వార్తలు

etv bharat latest top news
etv bharat latest top news
author img

By

Published : Dec 22, 2021, 6:07 AM IST

Updated : Dec 22, 2021, 10:00 PM IST

21:53 December 22

టాప్​ న్యూస్​ @10PM

  • ఒక్కరోజే 14 ఒమిక్రాన్​ కేసులు నమోదు

తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 24 గంటల వ్యవధిలో తెలంగాణలో కొత్తగా మరో 14 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 38కి చేరింది.

  • 'హస్తకళల పరిరక్షణకు చర్యలు చేపట్టాలి..'

Ramoji rao attends modi meeting: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దేశంలో అంతరించిపోయే దశలో ఉన్న కళలు, హస్తకళల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీని రామోజీ గ్రూప్​ అధినేత రామోజీరావు కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

  • 21 కేజీల హెరాయిన్ పట్టివేత

Heroine Seized In Thoothukudi: తమిళనాడులో అక్రమంగా తరలిస్తున్న 21 కేజీల హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బుధవారం జరిగిన ఈ ఘటనలో ఆరుగురిని అరెస్ట్ చేశారు.

  • సిరాజ్​ కాళ్లలో స్ప్రింగ్​లు ఉంటాయి: సచిన్​

Sachin Tendulkar praises Mohammed Siraj: టీమ్​ఇండియా పేసర్ మహ్మద్​ సిరాజ్​పై ప్రశంసలు కురిపించాడు దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​. అతడెప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తాడని, అద్భుతమైన ఆటగాడని కితాబిచ్చాడు.

  • 'శ్యామ్​సింగరాయ్'తో అది సాధ్యమైంది: నాని

నాని ద్విపాత్రాభినయం చేసిన 'శ్యామ్​సింగరాయ్'.. థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు నాని.

20:47 December 22

టాప్​ న్యూస్​@ 9PM

  • 'రైతులకు క్షమాపణలు చెప్పాలి'

Harish comments on Piyush goyal : దిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రులను ఉద్దేశించి కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆయన కేంద్రమంత్రిగా కాకుండా రాజకీయ నేతలా మాట్లాడారని ఆక్షేపించారు. 70లక్షల మంది రైతుల తరఫున రాష్ట్ర మంత్రులు దిల్లీ వెళ్తే... యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని అవమానపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు.

  • ' ముందస్తుకు వెళ్తారనే ప్రచారం ఉంది'

DK ARUNA ON CM KCR: : కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నెపం మోపి ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. యాసంగిలో ఉప్పుడు బియ్యం వేసే రైతులకు నూక వల్ల వచ్చే నష్టం నుంచి ఆదుకునేందుకు ప్రత్యేక బోనస్‌ ఇవ్వొచ్చు కదా? అని ప్రశ్నించారు.

  • 'తెరాస, భాజపావి నాటకాలు'

రాజకీయ లబ్ధి కోసమే భాజపా, తెరాస ప్రభుత్వాలు ధాన్యం కొనుగోళ్ల సమస్య తెరపైకి తెచ్చాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలనే ధాన్యంపై నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వానాకాలం పంట ఎంత కొంటారో చెప్పాలని తెరాస మంత్రులు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.

  • హైదరాబాద్​లో ఒమిక్రాన్

తెలంగాణలో మరో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. హైదరాబాద్ నగర శివారు హయత్‌నగర్‌లో 23 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధరణ అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. బాధితుడు సూడాన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చినట్లు తెలిపారు

  • పాకిస్థాన్​పై విన్​..​ కాంస్యం కైవసం

ఆసియా హాకీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా సెమీస్​లో ఓడిన భారత జట్టు తిరిగి పుంజుకుంది. నేడు(బుధవారం) మూడో స్థానం కోసం హోరాహోరీగా జరిగిన ప్లేఆఫ్స్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై గెలుపొంది కాంస్య పతకాన్ని అందుకుంది

19:48 December 22

టాప్​ న్యూస్​@ 8PM

  • దంపతుల బదిలీలపై మార్గదర్శకాలు

జోనల్ విధానానికి అనుగుణంగా కొత్త పోస్టింగుల్లో చేరాకే అప్పీళ్లు సహా స్పౌజ్ కేసుల కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది.

  • 'రైతులనుంచి దూరం చేసే కుట్ర'

Jagadeesh reddy comments: కేంద్రం వైఖరిపై మంత్రి జగదీశ్​ రెడ్డి మండిపడ్డారు. ధాన్యం కొంటారో లేదో కేంద్రమంత్రి చెప్పకుండా పార్టీ నేతలతో తిట్టిస్తున్నారని మండిపడ్డారు. వానాకాలంలో పూర్తి ధాన్యం కొనుగోలు చేయాలని అడిగేందుకే ఐదురోజులుగా దిల్లీలో ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు.

  • కశ్మీర్​లో ఉగ్రఘాతుకం

Terrorist Attack: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్​లో ఓ పౌరుడిని కాల్చిచంపారు. అనంత్​నాగ్​ బిజ్​బెహరా ప్రాంతంలో పోలీసు బృందంపై దాడి చేయగా.. ఏఎస్​ఐ పరిస్థితి విషమంగా ఉంది.

  • హరీశ్​ రావత్ తిరుగుబాటు​?

కాంగ్రెస్​ నాయకత్వం అనుసరిస్తున్న తీరును బహిరంగంగానే ప్రశ్నించి.. సంచలనం సృష్టించారు ఆ పార్టీ సీనియర్​ నేత, ఉత్తరాఖండ్​ మాజీ ముఖ్యమంత్రి హరీశ్​ రావత్​. పార్టీ తన చేతులను కట్టేసిందని విమర్శించారు

  • ఐపీఎల్​ మెగావేలం ఎప్పుడంటే?

IPL 2022 Mega auction: బెంగళూరు వేదికగా ఐపీఎల్​ 2022 మెగా వేలం ప్రక్రియను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఓ బోర్డు అధికారి తెలిపారు.

18:47 December 22

టాప్​ న్యూస్​@ 7PM

  • 'కేసీఆర్‌ ముందస్తుకు వెళ్తారనే ప్రచారం..!'

  • 'వాళ్లకు చిత్తశుద్ధి లేదు'

Vinod kumar fire on BJP: భాజపా నేతలపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భాజపా నేతలకు అధికార కాంక్ష తప్ప.. రాష్ట్ర ప్రజలు, రైతుల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర రైతాంగాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గందరగోళం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

  • బాధ్యతలు స్వీకరించిన కొత్త ఛైర్మన్లు..

chairpersons take charge: రాష్ట్రంలో కార్పొరేషన్లకు నియామకమైన కొత్త ఛైర్మన్లు పదవీ బాధ్యతలు స్వీకరించారు. తమపై నమ్మకముంచి.. అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని ఆయా కార్పొరేషన్లను అభివృద్ధి మార్గంలో నడిపించేందుకు తమవంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.

  • ఇకపై అవీ అస్సలు చేయను

Nani remake movies: ఇకపై తాను రీమేక్​లు అస్సలు చేయనని నేచురల్ స్టార్ నాని తెగేసి చెప్పారు. కెరీర్​లో ఇప్పటికే రెండు రీమేక్​ సినిమాలు చేసిన నాని.. వాటిని భవిష్యత్​లో చేయనని చెప్పడానికి కారణం ఏంటంటే?

  • 'మనీహైస్ట్'​ సిరీస్​లో కోహ్లీ..?

Virat Kohli Money Heist: తన గురించి అభిమానులు గూగుల్​లో వెతుకుతున్న ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు టీమ్​ఇండియా టెస్ట్​ సారథి కోహ్లీ. ఇందులో భాగంగా 'మనీహైస్ట్​' వెబ్​సిరీస్​ గురించి కూడా మాట్లాడాడు. ఆ విశేషాలు మీకోసం..

17:49 December 22

టాప్​ న్యూస్​@ 6PM

  • 'లవ్​ జిహాద్​' కేసులో 10ఏళ్ల జైలు

Uttar Pradesh love jihad case: ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పుర్​ జిల్లా కోర్టు లవ్​ జిహాద్​ కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.30వేల జరిమానా విధించింది. బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దోషిగా తేల్చుతూ శిక్ష ఖరారు చేసింది.

  • మొబైల్ కంపెనీలపై ఐటీ దాడులు

IT Raid on Oppo: పన్ను ఎగవేతకు సంబంధించి దేశంలో చైనాకు చెందిన మొబైల్​, ఫిన్​టెక్​ కంపెనీల్లో ఐటీ శాఖ దాడులు జరిపింది. ఒప్పో, షావోమీ, వన్​ప్లస్​ తదితర కంపెనీలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.

  • 'ఆపరేషన్ ఆక్సిజన్'- ప్రతి జిల్లాకు ఒకరు!

Oxygen Steward: కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ కొరతను నివారించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రతి జిల్లాకు ఒక 'ఆక్సిజన్​ స్టీవార్డ్​'ను నియమించే యోచనలో ఉంది. ప్రాణవాయువు వృథా అరికట్టే దిశగా పనిచేయడం సహా ఆక్సిజన్​ సరఫరాకు సంబంధించి అన్నీ వారే చూసుకునేలా శిక్షణ ఇవ్వనుంది.

  • 'ఆర్ఆర్ఆర్' టీమ్​తో భళ్లాలదేవ

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ఆర్ఆర్ఆర్ టీమ్​తో రానా ఫొటో, ధనుష్ తెలుగు సినిమా టైటిల్, భళా తందనాన చిత్రాల గురించిన కొత్త సంగతులు ఉన్నాయి.

  • పాకిస్థాన్​పై భారత్​ విజయం

ఆసియా హాకీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా సెమీస్​లో ఓడిన భారత జట్టు తిరిగి పుంజుకుంది. నేడు(బుధవారం) హోరాహోరీగా జరిగిన కాంస్య పతక పోరులో పాకిస్థాన్‌పై గెలుపొంది కాంస్య పతకాన్ని అందుకుంది.

16:46 December 22

టాప్​ న్యూస్​@ 5PM

  • ఇంటర్​ విద్యార్థిని ఆత్మహత్య

Inter student suicide : తాత్కాలిక సమస్యకు ఆత్మహత్యే శాశ్వత పరిష్కారమనుకుని విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పరీక్ష ఫెయిల్ అయితే... మళ్లీ రాయాల్సిందిపోయి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో మరో విద్యార్థిని ప్రాణం తీసుకుంది.

  • బ్యాగ్​లో రూ.14కోట్ల హెరాయిన్​

Uganda woman with heroin: ఉగాండా నుంచి దిల్లీ వచ్చిన మహిళ బ్యాగులో రూ.14కోట్లు విలువ చేసే హెరాయిన్​ గుర్తించారు కస్టమ్స్ అధికారులు. వెంటనే ఆమెను అరెస్టు చేశారు.

  • జీ-సోనీ సీఈఓ ఎవరంటే..?

Zee Sony Merger: దేశంలోనే అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్‌గా జీ-సోనీ విలీన సంస్థ అవతరించనుంది. ఈ మేరకు సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌ ఇండియా(ఎస్పీఎన్​ఐ), జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (జీఈఈఎల్​) మధ్య ఒప్పందం ఖరారైంది.

  • రామోజీ ఫిల్మ్​సిటీలో 'రాధేశ్యామ్' ప్రీ రిలీజ్

Radhe shyam movie: 'రాధేశ్యామ్' ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చే అభిమానులకు గుడ్​న్యూస్. ఎంట్రీ పాస్​లు ఉచితంగానే ఇస్తున్నామని నిర్మాణ సంస్థ పేర్కొంది. అలానే తెలుగు యువహీరో ఈ కార్యక్రమానికి యాంకరింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

  • 'అదే జరిగితే వెనక్కి పంపిస్తాం'

Teamindia vs South Africa: ఓమిక్రాన్​ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్​ బోర్డు పకడ్బంధీగా ఏర్పాట్లు చేస్తోంది. ఒకవేళ భారత ఆటగాళ్లు అనారోగ్యానికి గురైతే తక్షణమే వారికి వైద్య సహాయం అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇంకా పలు జాగ్రత్తలు కూడా తీసుకుంది.

15:43 December 22

టాప్​ న్యూస్​@ 4PM

  • నియోపోలిస్‌ భూములకు లైన్ క్లియర్​..

Kokapeta Neapolis lands: కోకాపేట నియోపోలిస్ భూముల అమ్మకానికి ఎట్టకేలకు లైన్​క్లియరైంది. భూములు అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 239, 240 సర్వే నంబర్లలోని భూమిపై పూర్తి హక్కులు ప్రభుత్వానివేనని సర్కారు స్పష్టం చేసింది

  • జగ్గారెడ్డి డెడ్​లైన్​

Jaggareddy letter to CM KCR: సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. ఇంటర్​ ఫలితాల్లో నెలకొన్న గందరగోళంపై ప్రభుత్వం పునరాలోచించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇంటర్​బోర్డు ముందు దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు.

  • 'బూస్టర్ డోసు ఎప్పుడు?'

Rahul Gandhi Vaccine Twitter: దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోసుపై కేంద్రాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఇంకా.. 60 శాతానికి పైగా జనాభాకు టీకా అందలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

  • ఎక్కడ చూసినా ఈ పాటలదే సందడి​!

Best Telugu Folk songs: 'బుల్లెట్టు బండి' పాట ఎంతగా హిట్​ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడ చూసినా ఇదే వినిపించేది. ఇప్పటికీ వినిపిస్తోంది. చాలా రోజుల పాటు ట్రెండింగ్​లో దూసుకెళ్లింది. అయితే ఈ పాట మాత్రమే కాదు ఇంకొన్ని జానపద సాంగ్​లు కూడా శ్రోతలను బాగా అలరించాయి. అవేంటో తెలుసుకుందాం..

  • అతని కోసం ఆరు నెలలు రీసెర్చ్‌

R Ashwin vs Steve Smith: టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గతేడాది ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. స్టీవ్ స్మిత్, లబుషేన్​లను ఔట్ చేసేందుకు తాను రచించిన ప్రణాళిలను వివరించాడు.

14:37 December 22

టాప్​ న్యూస్​@ 3PM

  • 'ప్రళయ్​' ప్రయోగం విజయవంతం

Pralay missile: 'ప్రళయ్​' బాలిస్టిక్​ క్షిపణిని రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. ఈ స్వల్ప శ్రేణి మిస్సైల్​ను అధునాతన ఫీచర్లతో డీఆర్​డీఓ అభివృద్ధి చేసినట్లు తెలిపింది.

  • లాయర్​ రాసలీలలు.. జడ్జి ముందే..!

Advocate Madras high court: ఆన్​లైన్​ విచారణ సందర్భంగా మహిళతో అనుచితంగా ప్రవర్తించి సస్పెండ్​ అయ్యారు మద్రాస్​ హైకోర్టుకు చెందిన ఓ న్యాయవాది. అడ్వకేట్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నివేదిక సమర్పించాలని సీబీ-సీఐడీని ఆదేశించింది కోర్టు.

  • కుక్క మరణంపై 9 ఏళ్లకు పరిహారం

COMPENSATION FOR DOG DEATH: పెంపుడు కుక్క మరణంపై ఓ వ్యక్తి న్యాయపోరాటం చేశారు. ఆ శునకం ద్వారా తనకు వచ్చే ఆదాయాన్ని అందించాలని సుదీర్ఘ కాలం పాటు న్యాయపోరాటం చేసి చివరకు విజయం సాధించాడు. సుమారు 9 ఏళ్ల పాటు న్యాయస్థానంలో పోరాడి రూ. 3 లక్షల పరిహారాన్ని పొందాడు.

  • హీరో బంధువు ఇంట్లో ఐటీ సోదాలు!

Actor Vijay IT Raids: పన్ను ఎగవేత ఆరోపణలతో తమిళ హీరో విజయ్​ సోదరుడు జేవియర్​ బ్రిటో నివాసంలో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. ఓ మొబైల్​ కంపెనీకి చెందిన కార్యాలయాలతో పాటు బ్రిటో ఇంట్లో అధికారులు తనిఖీలు చేశారు.

  • లఖ్​నవూ అసిస్టెంట్ కోచ్​ ఎవరంటే..!

Vijay Dahiya IPL 2022: ఐపీఎల్ 2022లో భాగంగా కొత్తగా లీగ్​లో అడుగుపెడుతున్న లఖ్​నవూ ఫ్రాంచైజీ సహాయ సిబ్బంది పదవుల భర్తీని పూర్తి చేసే పనిలో పడింది. ఇప్పటికే కోచ్​గా ఆండీ ఫ్లవర్​ను ఎంపిక చేసిన ఈ ఫ్రాంచైజీ.. తాజాగా అసిస్టెంట్ కోచ్​గా విజయ్ దహియాను నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది.ొ

  • 'బంగార్రాజు' వెనక్కి తగ్గుతాడా?

Bangarraju Release Date: నాగార్జున 'బంగార్రాజు' సంక్రాంతి రిలీజ్​పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 'ఆర్​ఆర్​ఆర్'​, 'రాధేశ్యామ్'​ చిత్రాల విడుదల నేపథ్యంలో ఇతర సినిమాల రిలీజ్​ వాయిదా పడుతుండటమే అందుకు కారణం. మరి 'బంగార్రాజు' సంక్రాంతి బరిలో నిలుస్తాడా?

13:51 December 22

టాప్​న్యూస్​@2PM

  • హైదరాబాద్​లో ఒమిక్రాన్ కలకలం

హైదరాబాద్‌లో మరో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైంది. హయత్‌నగర్‌లో 23 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధరణ అయింది.

  • ప్రజాక్షేత్రంలోనే ఎండగతాం

ధాన్యం కొనుగోళ్ల అంశంలో అసత్యాలు ప్రచారం చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. భాజపా ప్రభుత్వం రైతుల్లో గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు.

  • ఫొటోలతో బ్లాక్​మెయిల్

ఇద్దరు పదో తరగతి విద్యార్థినులు ఓ యువకుడిని హత్య చేయించిన ఘటన తమిళనాడులో జరిగింది. తమ అసభ్యకర ఫొటోలతో బ్లాక్​మెయిల్​ చేసినందుకే బాలికలు ఇలా చేసినట్లు అధికారులు తెలిపారు.

  • ఆస్కార్​లో మరోసారి నిరాశ

ఇటీవల భారత్​ తరపున ఆస్కార్​కు ఎంపికైన తమిళ చిత్రం 'కూళంగల్' ఈ రేస్​ నుంచి తప్పుకొంది. కాగా, మన దేశం తరఫున 'రైటింగ్ విత్​ ఫైర్​' అనే డాక్యుమెంటరీ షార్ట్​ లిస్ట్​ అయింది.

  • ఆర్చర్​కు మరో సర్జరీ

ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అభిమానులకు నిరాశే మిగిలింది. గాయం నుంచి కోలుకుని త్వరలో మైదానంలో అడుగుపెడతాడనుకున్న ఈ బౌలర్​కు మరోసారి చికిత్స జరిగింది. దీంతో మరికొంతకాలం ఇతడు బరిలో దిగే అవకాశం లేదని బోర్డు తెలిపింది.

12:48 December 22

టాప్​న్యూస్​@1PM

  • మాజీ సర్పంచ్ హత్య

ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు గ్రామ మాజీ సర్పంచ్ కొర్స రమేశ్​ను మావోయిస్టులు హత్య చేశారు. డిసెంబర్​ 20న రమేశ్​ను అపహరించుకుపోయిన మావోయిస్టులు హత్య చేశారు.

  • డ్రగ్స్‌బారిన పడకుండా చూడాలి

యువకులు మత్తు పదార్థాల బారిన పడకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డీ ఎడిక్షన్​ సెంటర్లు ఏర్పాటు చేయాలని గవర్నర్​ తమిళిసై సూచించారు. యువత, చిన్నారులు డ్రగ్స్​ బారిన పడకుండా చూడాలని పేర్కొన్నారు.

  • ఆంధ్రప్రదేశ్​లో రెండో ఒమిక్రాన్‌ కేసు

ఆంధ్రప్రదేశ్​లో రెండో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన మహిళలో ఒమిక్రాన్​ను గుర్తించారు. ఈనెల 12 నుంచి కెన్యా నుంచి చెన్నై వచ్చిన 39 ఏళ్ల మహిళ... అక్కడి నుంచి తిరుపతి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

  • బాలీవుడ్ అవకాశాల కోసం

టాలీవుడ్​ స్టార్​ హీరో ఎన్టీఆర్​​ తన బాలీవుడ్​ ఎంట్రీపై ఆసక్తికర విషయం చెప్పారు. తాను బాలీవుడ్‌ సినిమా అవకాశాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం విడుదలైన తర్వాత పరిస్థితులు మారి అవకాశాలు రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • అతడే బెస్ట్ కెప్టెన్..

పాకిస్థాన్ యువ పేసర్ షాహీన్ అఫ్రిది కెప్టెన్ బాబర్ అజామ్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అజామ్ కంటే ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్​ గొప్ప కెప్టెన్​ అంటూ కితాబిచ్చాడు.

11:50 December 22

టాప్​న్యూస్​@12PM

  • గోయల్‌ క్షమాపణలు చెప్పాలి

Harish comments on Piyush goyal : రాష్ట్రంలోని 70 లక్షలమంది రైతుల తరఫున రాష్ట్ర మంత్రులు దిల్లీ వెళ్తే... అన్నదాతల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా కేంద్రమంత్రి మాట్లాడారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పీయూష్ గోయల్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణను కించపరిచే హక్కు మీకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.

  • ముగిసిన పార్లమెంట్ సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. అజెండాలో చాలా వరకు అంశాలు పూర్తయిన నేపథ్యంలో షెడ్యూల్​కు ఒకరోజు ముందుగానే ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాలకు సంబంధించిన పేపర్లు, నివేదికలను సమర్పించిన అనంతరం.. రాజ్యసభను వాయిదా వేస్తున్నట్టు ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు.

  • కరోనాతో అగ్రరాజ్యం విలవిల

US COVID CASES: ప్రపంచాన్ని కరోనా కొత్త వేరియంట్ వణికిస్తోంది. ఒమిక్రాన్ కేసులతో పలు దేశాలు విలవిల్లాడుతున్నాయి. అమెరికాలో కొత్తగా లక్షా 81 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో అధిక శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్​లోనూ కేసులు అధికంగా నమోదవుతున్నాయి.

  • భారత్​కు కలిసొచ్చేది అదే: జహీర్

Zaheer Khan Team India Bowling: ప్రస్తుతం టీమ్ఇండియా పేస్ దళం పటిష్ఠంగా ఉందన్నాడు మాజీ పేసర్ జహీర్ ఖాన్. అందుకే ఇటీవల కాలంలో భారత్ విదేశీ పిచ్‌లపై కూడా ఆధిపత్యం చెలాయిస్తోందని పేర్కొన్నాడు.

  • ఆస్కార్​ రేస్​ నుంచి 'కూళంగల్​' ఔట్

Koozhangal Movie Oscar: ఇటీవల భారత్​ తరపున ఆస్కార్​కు ఎంపికైన తమిళ చిత్రం 'కూళంగల్' ఈ రేస్​ నుంచి తప్పుకొంది. కాగా, మన దేశం తరఫున 'రైటింగ్ విత్​ ఫైర్​' అనే డాక్యుమెంటరీ షార్ట్​ లిస్ట్​ అయింది.

10:47 December 22

టాప్​న్యూస్​@11AM

  • అందమే పెట్టుబడి

Social Media Honey Trap: గుర్తు తెలియని యువతి నుంచి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్! ప్రొఫైల్‌ ఫొటో అందంగా ఉంది కదా అని వెంటనే అంగీకరించారా సైబర్‌ ఎరకు చిక్కినట్లే! మత్తెక్కించే మాటలు... కైపెక్కించే చేష్టలతో నగ్న వీడియోలు సేకరించి... చుక్కలు చూపెడతారు. బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసి ఇల్లు గుల్ల చేస్తారు.

  • తల్లిదండ్రులదే విజయం

father and son relationship family issues : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీలో తండ్రీ కొడుకుల మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో తన కుమారుడు పట్టించుకోవడం లేదని... తాను సొంతగా కొన్న ఇంట్లోకి రానివ్వడం లేదంటూ ఆ తండ్రి కలెక్టర్ అప్పిలేట్ ట్రిబ్యునల్​కు వెళ్లారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కొడుకు, కోడలిని ఇంటి నుంచి అధికారులు ఖాళీ చేయించారు. తల్లిదండ్రులకే ఆ ఇల్లును అప్పగించారు.

  • రోదసిలో టైం మెషీన్

James Webb Telescope: సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది. మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రయత్నం త్వరలో సాకారం కానుంది. విశ్వ ఆవిర్భావం తొలినాళ్లను చూడటానికి తోడ్పడే అంతరిక్ష చక్షువు ఆవిష్కృతం కానుంది.

  • కెప్టెన్​గా ఎందుకున్నావ్ మరి?

Ponting on Root: యాషెస్ సిరీస్​లో భాగంగా ఇంగ్లాండ్​తో జరిగిన రెండు టెస్టుల్లో ఘనవిజయం సాధించింది ఆస్ట్రేలియా. అడిలైడ్ వేదికగా జరిగిన డేనైట్ టెస్టు ఓటమి అనంతరం ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ జో రూట్ మాట్లాడుతూ బౌలర్లను తప్పుబట్టాడు.

  • ట్రోల్‌పై స్పందించిన సమంత

Pushpa Item Song: 'సెకండ్‌ హ్యాండ్‌ ఐటెమ్‌' అంటూ ట్రోల్‌ చేసిన ఓ నెటిజన్‌కు ప్రముఖ నటి సమంత తనదైన శైలిలో సమాధానమిచ్చారు. 'భగవంతుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా' అని సదరు నెటిజన్‌కు రిప్లై ఇచ్చారు.

09:52 December 22

టాప్​న్యూస్​@10AM

  • ఇకపై ఇంటికే పాసుపుస్తకాలు

Dharani passbook news : రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తయ్యాక పాసు పుస్తకం కోసం రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఇకపై ఆ సమస్యకు చెక్ పడనుంది. కేవలం ఈ-కేవైసీ సమర్పిస్తే చాలు... నేరుగా ఇంటికే రానుంది. మ్యుటేషన్ సమస్యల పరిష్కారం కోసం ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తోంది.

  • మరో 6,317‬ మందికి కరోనా వైరస్

India Covid cases: భారత్​లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా 6,317‬ మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 318 మంది మృతి చెందారు. కాగా దేశంలో ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 215కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

  • ఈసారి మేడారం భక్తులకు ప్రసాదం

Medaram Jatara: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఈసారి ప్రసాదం పంపిణీ చేయాలనుకుంటున్నట్లు గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌ తెలిపారు.

  • లాభాల్లో స్టాక్ మార్కెట్లు

స్టాక్​మార్కెట్లు బుధవారం సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్ 392 పాయింట్లు లాభపడి 56,711 వద్ద కొనసాగుతుంది. మరో సూచీ నిఫ్టీ 107 పాయింట్లకు పైగా వృద్ధి చెంది 16,878 వద్ద ట్రేడవుతోంది.

  • 'పుష్ప' ఓటీటీ రిలీజ్​?

Pushpa OTT Release: థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుండగానే 'పుష్ప' పార్ట్-1​ ఓటీటీ రిలీజ్​పై వార్తలు వస్తున్నాయి. అమెజాన్​ ప్రైమ్​లో విడుదలయ్యే ఈ చిత్ర​ రిలీజ్​ డేట్​ను ఖరారైందని తెలుస్తోంది.

08:45 December 22

టాప్​న్యూస్​@9AM

  • హెచ్ఐవీ బాధితుల్లో ఒమిక్రాన్ పుట్టుక

Omicron Connections With HIV: దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒమిక్రాన్‌ మూలాల్లో హెచ్‌ఐవీ ఉంది అని ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు! ఆ దేశంలో 18-45 ఏళ్ల వయసున్న ప్రతి ఐదుగురిలో ఒకరు హెచ్‌ఐవీకి గురయ్యారని, ప్రపంచ హెచ్‌ఐవీ కేంద్రంగా ఆ దేశం మారిందని పేర్కొన్నారు. ఈ వైరస్‌ సోకినవారిలో 30% పైగా మంది అసలు యాంటీరిట్రోవైరల్‌ డ్రగ్స్‌ని తీసుకోవడమే లేదని వివరించారు.

  • సొంత జిల్లాలకు ఉద్యోగులు

Local cadre Report: జోన్లు, బహుళజోన్ల స్థానాలకు బదలాయింపులపై మంగళవారం సచివాలయంలో కసరత్తు జరిగింది. కొత్త జోనల్‌ విధానంలో భాగంగా ఉద్యోగులను సొంత జిల్లాలకు బదలాయించారు. వారిలో 25 శాతం మంది రిపోర్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.

  • పారాగ్లైడర్​ను ఢీకొని కూలిన విమానం

Plane hits paraglider అమెరికా హ్యూస్టన్​లో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఓ తేలికపాటి విమానం.. పారాగ్లైడర్​ను ఢీకొని నెలకొరిగినట్లు అధికారులు తెలిపారు.

  • డోప్‌ ఉల్లం'ఘనుల'లో మూడో ర్యాంకు

India Wada Rank: ప్రపంచ డోప్ ఉల్లంఘనుల జాబితాలో మూడో ర్యాంకులో నిలిచింది భారత్. 2019 ఏడాదికిగానూ వాడా(World Anti Doping Agency) ప్రకటించిన జాబితాలో రష్యా, ఇటలీ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

  • '83' చిత్రానికి పన్ను మినహాయింపు

83 Movie Delhi: ఈనెల 24న విడుదల కానున్న '83' చిత్రానికి ఎలాంటి పన్ను వసూలు చేయకూడదని దిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రణ్​వీర్​ సింగ్​ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

07:58 December 22

టాప్​న్యూస్​@8AM

  • బీబీనగర్‌ ఎయిమ్స్‌ నిర్మాణంలో జాప్యం!

బీబీనగర్ ఎయిమ్స్ ఏర్పాటు నిర్మాణం మరో ఏడాది పాటు జాప్యం అయ్యేలా కనిపిస్తోంది. ఈ మేరకు పార్లమెంటు అంచనాల కమిటీ నివేదిక సమర్పించింది. ప్రస్తుతం ప్రీఇన్వెస్ట్‌మెంట్‌ పనులు పురోగతిలో ఉన్నాయి.

  • కుక్క పేరు తెచ్చిన తంట

Woman set on fire by Neighbour: ముద్దుగా పెంచుకునే ఓ కుక్కకు పెట్టిన పేరు ఓ మహిళ ప్రాణానికే ప్రమాదకరంగా మారింది. ఈ ఘటన గుజరాత్​లో జరిగింది. అసలేమైందంటే..

  • 2 లక్షల కోట్ల సమీకరణ లక్ష్యం!

IPOs in 2022: వచ్చే ఏడాదిలో ఐపీఓల ప్రవాహం కొనసాగనున్నట్లు తెలుస్తోంది. రూ.2 లక్షల కోట్ల సమీకరణ లక్ష్యం కలిగిన పబ్లిక్‌ ఇష్యూలు సిద్ధంగా ఉన్నాయని కోటక్‌ మహీంద్రా కేపిటల్‌ నివేదిక పేర్కొంది.

  • అభిమానులే చెప్పాలి: శ్రీకాంత్

Kidambi Srikanath Interview: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్​షిప్​లో రజతం సాధించిన తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్​కు హైదరాబాద్​లో ఘనస్వాగతం లభించింది. గోపీచంద్ అకాడమీలో శ్రీకాంత్‌తో కేక్‌ కట్‌ చేయించి సంబరాలు చేసుకున్నారు. అనంతరం శ్రీకాంత్‌ విలేకరులతో మాట్లాడాడు. ఆ వివరాలు అతని మాటల్లోనే..

  • టాలీవుడ్​లో మెరిసిన కొత్త తారలు

Tollywood Latest News: ఈ ఏడాది టాలీవుడ్​లో ఎంతో మంది కొత్త హీరోలు, హీరోయిన్లు అదృష్టం పరీక్షించుకున్నారు. అయితే కొంత మంది మాత్రమే విజయం అందుకున్నారు. మరికొందరు జయాపజాయలతో సంబంధం లేకుండా జోరు చూపించారు. మరి ఆ నటీనటులు ఎవరంటే..

06:50 December 22

టాప్​న్యూస్​@7AM

  • తెలంగాణపై అమిత్​షా నజర్

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంపై తెరాస తీవ్రస్థాయిలో చేస్తున్న ఆందోళనలను సీరియస్​గా తీసుకున్న కేంద్రం.. దీటుగా ఎదుర్కునేందుకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​షానే నేరుగా రంగంలోకి దిగుతున్నారు.

  • శరాఘాతంగా బ్రాండెడ్‌ సిఫార్సులు

Dr prescription: వైద్యులు రాసే గొలుసుకట్టు రాతలు సాధారణ జనానికి అర్థంకాక అల్లాడుతున్నారు. వాళ్లు రాసే మందుల చీటీ అర్థంకాక తలనొప్పి వస్తోంది. జనరిక్ పేర్లతో కాకుండా... బ్రాండ్ పేరుతో మందులు రాయడం పరిపాటిగా మారింది.

  • టికెట్‌ ధర కోటి.. ప్రత్యేకతలు ఇవే!

తిరుమల శ్రీనివాసుడి సేవలో తరించేందుకు.. తితిదే మరోసారి అవకాశం కల్పించింది. స్వామి వారి ఉదయాస్తమాన సేవల టికెట్‌ ధర.. రూ.కోటిగా నిర్ణయిస్తూ తితిదే ప్రకటన చేసింది. సాధారణ రోజుల్లో టికెట్‌ ధర రూ.కోటి ఉండగా.. శుక్రవారం మాత్రం రూ.కోటిన్నర ఉంటుందని తెలిపింది.

  • మైదానంలోనే క్రికెటర్​కు గుండెపోటు

Abid Ali heart Attack: పాకిస్థాన్ టెస్టు క్రికెటర్​ అబిద్ అలీకి మైదానంలో బ్యాటింగ్ చేస్తుండగానే గుండెపోటు వచ్చింది. తీవ్రమైన ఛాతి నొప్పితో బాధపడుతుండగా.. వెంటనే అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు.

  • వంట నూనె ధరలు తగ్గుతాయ్‌!

Refined Palm Oil: రిఫైన్డ్‌ పామాయిల్‌పై ప్రాథమిక కస్టమ్స్‌ సుంకాన్ని(బీసీడీ) 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది కేంద్రం. 2022 మార్చి వరకు ఇది అమల్లో ఉంటుంది. ఈ చర్యతో దేశంలో వంట నూనె ధరలు తగ్గనున్నాయి.

05:46 December 22

టాప్​న్యూస్​@ 6 AM

  • పంటి బిగువున కష్టాలను భరిస్తూ..

Old women pension problem in Khammam: తల్లి పండుటాకు. కుమార్తెకు చిన్నప్పుడే రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. నాలుగు పదుల వయసు దాటుతున్నా.. లేచి నిలబడలేని దయనీయ స్థితి. తనకే ఒకరు ఆసరాగా ఉండాల్సిన స్థితిలో.. మంచం పట్టిన అమ్మకు ఆలనా పాలనా చూసుకుంటోంది. కష్టాలన్నింటినీ పంటి బిగువున భరిస్తూ బతుకీడుస్తున్న ఆ తల్లీ కుమార్తెలను.. కాలం పరీక్ష పెడుతూనే ఉంది. తల్లి వృద్ధాప్య పింఛను కోసం అనేక సార్లు దరఖాస్తు చేసినా.. మంజూరు కాకపోవడంతో పూట గడవటమే కష్టంగా మారింది. ఆపన్నహస్తం కోసం ఆ తల్లీకుమార్తె... దీనంగా అర్ధిస్తున్నారు.

  • పులి చర్మాన్ని విక్రయించేందుకు..

SMUGGLING TIGER SKIN: పులుల సంరక్షణ కోసం కేంద్రం కోట్లు ఖర్చుపెడుతోంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ర్యాలీలు నిర్వహిస్తోంది. అయినా కొన్నిచోట్ల కాసుల కక్కుర్తికి... పులులు బలికాక తప్పడంలేదు. మంగళవారం.. పులి చర్మాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ముఠాను ములుగు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • గణనీయంగా తగ్గిన పంట విస్తీర్ణం

Yasangi Cultivation in Palamuru: ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో యాసంగి సాగు గందరగోళంలో పడింది. నాగర్ కర్నూల్ మినహా మిగిలిన 4 జిల్లాల్లో రబీసాగు 40 శాతానికి మించలేదు. సర్కారు వద్దనడంతో యాసంగిలో వరి విస్తీర్ణం గణనీయంగా తగ్గనుంది. ప్రత్యామ్నాయ పంటల సాగు కూడా పెరగలేదు. విత్తనాలు లేకపోవడం, కొనుగోలు హామీ ఇవ్వకుండా ఇతర పంటలవైపు ఎలా వెళ్లాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఏ పంట పండించాలో తేల్చుకోలేని రైతులు తమ భూముల్ని పడావు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

  • పోలీస్​ అధికారులకు ఐపీఎస్​ హోదా

IPS promotions: తెలంగాణకు చెందిన 20 మంది పోలీస్​ అధికారులకు ఐపీఎస్​ హోదా దక్కింది. ఐపీఎస్ నిబంధనలకు లోబడి ఈ అధికారులందరూ ఏడాది పాటు ప్రొబేషన్​లో ఉంటారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్​ జారీ చేసింది.

  • డెల్టా కంటే ఒమిక్రాన్​ 3 రెట్లు వేగంగా వ్యాప్తి..

Omicron Transmission vs Delta: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త రకం వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది కేంద్రం. ఒమిక్రాన్‌ను కట్టడి చేసేందుకు తక్షణమే వార్‌రూమ్‌లను యాక్టివేట్‌ చేయాలని కోరింది.

  • 'మా పిల్లల ఇన్‌స్టాగ్రామ్​ ఖాతాలు హ్యాక్‌ అయ్యాయి'

Priyanka Gandhi Children: ప్రధాని మోదీ ప్రయాగ్​రాజ్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్​ నేత ప్రియాంక గాంధీ పలు వ్యాఖ్యలు చేశారు. తమ పిల్లల ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలు హ్యాక్ అయినట్లు ఆరోపించారు.

  • ఎల్​ఓసీ వెంబడి పాక్​ నిర్మాణాలు

Pakistan construction along LoC: జమ్ముకశ్మీర్​లో నియంత్రణ రేఖ(ఎల్​ఓసీ) వెంబడి పాకిస్థాన్​ నిర్మాణాలను చేపట్టగా భారత ఆర్మీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్మాణాలను ఆపేయాలని లౌడ్​స్పీకర్లతో హెచ్చరించింది.

  • దుబాయ్‌ రాజుకు చుక్కెదురు..

Dubai ruler Sheikh Mohammed: బ్రిటన్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దుబాయ్ రాజు షేక్ మహమ్మద్.. ఆయన మాజీ భార్య హయా బింత్​కు రూ. 5,555 కోట్లు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. అయితే.. బ్రిటిష్‌ చరిత్రలో అత్యధిక ఖరీదైన విడాకుల సర్దుబాటు వ్యవహారంగా దీన్ని చెబుతున్నారు.

  • 'పుష్ప' టీమ్​కు అక్షయ్​ కంగ్రాట్స్​..

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో 'పుష్ప', 'రైటర్​', 'సెల్యూట్​', 'అర్జున ఫల్గుణ' చిత్రాల సంగతులు ఉన్నాయి.

  • 'భారత్​కిదే అద్భుత అవకాశం'

దక్షిణాఫ్రికా టీంలో సీనియర్లు లేమి టీమ్​ఇండియాకు కలిసివస్తుందని అభిప్రాయపడ్డాడు క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్​. సౌతాఫ్రికా గడ్డపై చరిత్ర సృష్టించడానికి ఇది సరైన అవకాశమని అన్నాడు.

Last Updated : Dec 22, 2021, 10:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.