ETV Bharat / city

క్యామ్ & ఆన్ అవార్డ్స్‌లో మెరిసిన బాల భారత్.. మూడు విభాగాల్లో అవార్డులు.. - యానిమేషన్ విభాగంలో బాలభారత్​కు అవార్డులు

ETV Bal Bharat: ఆకట్టుకునే కథనాలు, ఆసక్తి కలిగించే యానిమేషన్లతో చిన్నారుల విభాగంలోకి దూసుకొచ్చిన ఈటీవీ బాల భారత్ జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది. కిడ్స్, యానిమేషన్ & మోర్ (కేఏఎం), ఆన్ అవార్డ్స్ సమ్మిట్​లో మూడు అవార్డులు కైవసం చేసుకుంది. మోరల్​ స్టోరీస్, బెస్ట్ యామిమేషన్ క్యారెక్టర్, బెస్ట్ యానిమేషన్ సాంగ్​లో విజేతగా నిలిచింది.

ETV Bal Bharat
ETV Bal Bharat
author img

By

Published : Aug 30, 2022, 10:30 PM IST

ETV Bal Bharat: ఈటీవీ బాలభారత్ పిల్లల చిత్రాలు, యానిమేషన్ విభాగంలో తన సత్తా చాటింది. ఇటీవల జరిగిన కిడ్స్, యానిమేషన్ & మోర్ (కేఏఎం), ఆన్ అవార్డ్స్ సమ్మిట్ యొక్క మూడో ఎడిషన్​లో మూడు విభాగాల్లో ఈటీవీ బాల భారత్ విజేతగా నిలిచింది. పిల్లలకు వినోదాన్ని అందించే ఈటీవీ నెట్‌వర్క్​లోని బాలభారత్​ నుంచి విజ్డమ్ ట్రీ- మోరల్ స్టోరీస్ ఉత్తమ ప్రీస్కూల్ షోగా ఎంపికైంది. బ్రాండ్ టీవీసీ పుషప్ ఛాలెంజ్‌లోని యానిమేటెడ్ పాత్రతో పాటు, అభిమన్యు ది యంగ్ యోధాలోని పాట ఉత్తమ యానిమేషన్ సాంగ్​గా ఎంపికైంది.

చిన్నారులకు నచ్చే ఆసక్తికరమైన కార్యక్రమాలు, విస్తారమైన యానిమేటెడ్ ప్రోగ్రామ్​లను ఎన్నో ఈటీవీ బాల భారత్ అందిస్తోంది. 4 నుండి 14 సంవత్సరాల వయసున్న పిల్లల కోసమే ప్రత్యేకంగా ఆకట్టుకునే యాక్షన్, ఆసక్తి గొలిపే అడ్వెంచర్, కామెడీ, పురాణేతిహాసాలు, సస్పెన్స్ మిస్టరీ, ఫాంటసీ కథలు, నైతిక విలువలను పెంచే ఎన్నో కథలు, సినిమాలను, యానిమేటెట్ సిరీస్​లను అందిస్తోంది. రోజు వారివారి ప్రాంతీయ భాషల్లోనే వచ్చే బాల భారత్ కార్యక్రమాలు చిన్నారులను ఎంతగానే ఆకట్టుకుంటున్నాయి.

ఉల్లాస భరితమైన స్ఫూర్తి, ఉత్సుకతతో కూడిన బాల్యాన్ని జరుపుకోవడానికి తోడ్పాడు అందించేలా ఈటీవీ బాల భారత్ స్వయంగా నిర్మించిన కథనాలు, అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన ఎన్నో కార్యక్రమాలను పిల్లలకు అందిస్తోంది. వీటి ద్వారా చిన్నారుల మానసిక పరిపకత్వతకు అవసరమైన తోడ్పాటుతో పాటు అపరిమితమైన నైతిక విలువలను అందిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.