ETV Bharat / city

పరీక్షలపై సందిగ్ధం... సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ - తెలంగాణ ఇంజినీరింగ్ పరీక్షల వార్తలు

ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వాహణపై ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పరీక్షలు నిర్వహిస్తారా.. లేక రద్దు చేస్తారా అని విద్యార్థులతో పాటు.. తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. బాసర ఐఐఐటీలో పీయూసీ రెండో సంవత్సరం, ఇంజినీరింగ్ చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా సందిగ్ధంలో ఉన్నారు. ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీతో పాటు.. అన్ని చివరి సెమిస్టర్ పరీక్షల రద్దుకే అధికారులు మొగ్గు చూపుతున్నప్పటికీ.. ముఖ్యమంత్రి తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు.

cm kcr
cm kcr
author img

By

Published : Jun 27, 2020, 4:06 PM IST

కరోనా తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో పరీక్షలపై ఉత్కంఠ నెలకొంది. ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీతో పాటు.. ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై ప్రభుత్వం నిర్ణయం కోసం లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. దాదాపు ఈ పరీక్షలన్ని రద్దు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ ఫలితాలు ఈనెల 18న విడుదలయ్యాయి. మొదటి సంవత్సరంలో 1,92,172.. రెండో సంవత్సరంలో 1,28,169 మంది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక పోయారు.

సీఎం నిర్ణయంపై ఉత్కంఠ

సాధారణంగా ఏటా ఫలితాలు ప్రకటించిన రోజునే అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు ప్రకటిస్తారు. కానీ ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్ష నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేయాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా రద్దు చేసే ఆలోచనలోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం కోసం విద్యార్థులతో పాటు అధికారులు వేచి చూస్తున్నారు.

వీటిపై సందిగ్ధం

ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ పరీక్షలపై కూడా విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇంజినీరింగ్ చివరి సెమిస్టర్ పరీక్షలను ఈనెల 20నుంచి నిర్వహించనున్నట్లు గతంలో జేఎన్​టీయూహెచ్ ప్రకటించింది. డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షలకు ఉస్మానియా యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేయడంతో.. విద్యార్థుల ఫీజులు చెల్లించారు. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ పరీక్షలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన రోజునే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. యూనివర్సిటీలు తమ ఏర్పాట్లను నిలిపివేశాయి.

ఇంటర్నల్ మార్కల ఆధారంగా..

ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలన్నీ రద్దు చేసి.. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మార్కులు ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి సర్కారుకు ప్రతిపాదలను పంపించినట్లు తెలుస్తోంది. ఇతర సెమిస్టర్ల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై సెమిస్టర్​కు ప్రమోట్ చేసి.. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత డిసెంబరులో పరీక్షలు నిర్వహించాలని సూచించారు. దీనిపై కూడా ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

రద్దు చేస్తారా!

బాసర ఐఐఐటీగా వ్యవహరించే రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియట్ స్థాయిలోని పీయూసీ రెండో సంవత్సరం చివరి సెమిస్టర్ విద్యార్థుల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్​లో అన్ని సెమిస్టర్ల విద్యార్థులను ప్రమోట్ చేసి.. వీలైనప్పుడు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే పీయూసీ తర్వాత కొందరు విద్యార్థులు జేఈఈ, ఎంసెట్ రాస్తారు కాబట్టి.. వారి పరీక్షలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా ఆరో సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తారా లేదా రద్దు చేస్తారా అనే నిర్ణయం ప్రకటించలేదు.

ఇదీ చదవండి: ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠినంగా వ్యవహరిస్తాం: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.