ETV Bharat / city

తాలు, తరుగు పేరుతో మోసం: మర్రి

తాలు, తరుగు పేరుతో అన్నదాతల్ని ప్రభుత్వం మోసం చేస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. రైతులకు జరుగున్న అన్యాయాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై సీఎస్‌కు లేఖ రాసినట్లు తెలిపారు.

author img

By

Published : Jun 1, 2020, 3:58 PM IST

తాలు, తరుగు పేరుతో మోసం: మర్రి
తాలు, తరుగు పేరుతో మోసం: మర్రి

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. సంచులు, తాలు, తరుగు పేరుతో ధరలు, కొలతల రూపంలో అన్నదాతలకు అన్యాయం జరిగుతుందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏళ్ల తరబడి జరుగుతూనే ఉందని గుర్తు చేశారు. యాసంగిలో కోటి టన్నులకు పైగా ధాన్యం, 14 లక్షల టన్నుల మొక్కజొన్న కొంటామన్న ప్రభుత్వం.. అందులో సగం కూడా కొనలేదని విమర్శించారు.

అధికారులకు ఫిర్యాదు చేసినా..

ఇప్పుడు ఎఫ్‌సీఐ ధాన్యాన్ని సేకరించిందని చెప్పుకోవడం మోసం చేయడమేనని వ్యాఖ్యానించారు. మిగిలిన ధాన్యం, మొక్కజొన్నలను కూడా పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఇబ్బందులపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. రైతులకు జరుగుతున్న మోసాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు వివరించారు.

తాలు, తరుగు పేరుతో మోసం: మర్రి

ఇవీ చూడండి: గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద భారీగా నిలిచిన వాహనాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.