ETV Bharat / city

ఐటీ సొబగులతో సహకార రంగంలో అద్భుత ఫలితాలు...

రాష్ట్రంలో సహకార రంగంలో ఐటీ సొబగులు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి. సేవలు అందించడంలో... పారదర్శకత పాటించడంలో కంప్యూటరీకరణ మంచి ఫలితం ఇస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధునికీకరిస్తూ సాగుతుండటం వల్ల వినియోగదారులకు సేవలు అందించడంలోనూ అద్భుత పనితీరు కనబరుస్తున్నాయి.

computerization in Cooperative societies gives good results

author img

By

Published : Dec 20, 2020, 5:11 AM IST

రాష్ట్రంలో ప్రభుత్వ రంగ, వాణిజ్య బ్యాంకులకు దీటుగా సహకార బ్యాంకులు పనిచేస్తున్నాయి. రైతులు, వినియోగదారులకు నాణ్యమైన సేవలందించాలన్న లక్ష్యంతో... సహకార బ్యాంకులపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం... విప్లవాత్మక సంస్కరణలు శ్రీకారం చుట్టింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నాయి. ఇతర బ్యాంకుల మాదిరే అన్ని రకాల డిజిటల్‌ సేవలు అందిస్తున్నాయి. రాష్ట్రంలోని సహకార బ్యాంకుల్లో తెస్తున్న విప్లవాత్మక మార్పులపై ప్రశంసలూ వెల్లువెత్తుతున్నాయి. నీతి ఆయోగ్, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ, నాబార్డ్ ప్రతినిధులు స్వయంగా హైదరాబాద్‌లోని సైబర్‌ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ సందర్శించి సేవలను కొనియాడారు.

లాభాలబాటలో...

కంప్యూటీకరణ తర్వాత అన్ని సేవల్లో పారదర్శకత పెరిగి సహకార సంఘాలు లాభాలబాటలో నడుస్తుండటం విశేషం. పూర్తి కంప్యూటరీకరణ చేపట్టడంతో దేశవ్యాప్త గుర్తింపు దక్కింది. ఇతర రాష్ట్రాలు తెలంగాణ వైపు దృష్టి సారించాయి. జనవరిలో ఆర్బీఐ, నాబార్డ్ నేతృత్వంలో జరిగే అఖిల భారత సహకార బ్యాంకుల సమావేశంలో.... సొసైటీల కంప్యూటీకరణ, సైబర్‌ సెక్యూరిటీ ఆపరేషన్స్‌పై ప్రజెంటేషన్ ఇవ్వాలంటూ రాష్ట్ర అధికారులకు ఆహ్వానం అందినట్లు టెస్కాబ్‌ సీఐఓ ముప్పనేని శ్రీనివాస్‌ తెలిపారు.

అక్కడక్కడా అవగాహనలేమి...

మెరుగైన సేవలే లక్ష్యంగా... ఇటీవల డీసీసీబీల్లో రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు-టెస్కాబ్‌ నూతన సాఫ్ట్‌వేర్‌ను వినియోగంలోకి తెచ్చింది. కొత్త సాఫ్ట్‌వేర్‌పై కేంద్ర సహకార బ్యాంకుల్లో సిబ్బందికి పూర్తిస్థాయి అవగాహన రాకపోవడం వల్ల పలు సమస్యలు తలెత్తుతున్నాయి. పంట రుణాల చెల్లింపులు, కొత్త రుణాలు, డిపాజిట్లు, రెన్యువల్‌ కోసం బ్యాంకులకు వెళితే సాఫ్ట్‌వేర్ సమస్యంటూ ఖాతాదారులకు వెనక్కి తిప్పిపంపుతున్నారు. ఈ నెలాఖరులోగా ఈ సమస్యలు అన్నింటినీ పూర్తిగా పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా...

రాష్ట్రంలో సహకార సంఘాలు సాధించిన పురోగతిపై ఇతర రాష్ట్రాలు దృష్టిసారించాయి. రాష్ట్రంలో కంప్యూటరీకరణ, అన్ని రకాల సేవలు అందిస్తుండటం గురించి తెలుసుకునేందుకు ఇక్కడికి వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తమిళనాడు, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌, పశ్చిమ్‌బంగ్ వంటి రాష్ట్రాలు కంప్యూటీకరణ ప్రక్రియ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తుండటం విశేషం.

ఇదీ చూడండి: కేసీఆర్​ ఫాం హౌజ్​లో ఏదో ఉంది.. డీజీపీ తనిఖీ చేయాలి: బండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.