ETV Bharat / city

scholarships for telangana students : యాజమాన్యాల నిర్లక్ష్యం... విద్యార్థులకు ఉపకారవేతనాలు దూరం - తెలంగాణలో విద్యార్థులకు స్కాలర్​షిప్

విద్యార్థులకు కాస్త ఆర్థిక భరోసా ఇవ్వడానికి రాష్ట్ర సర్కార్ ఉపకార వేతనాలు(scholarships for telangana students), బోధన రుసుం(tuition fees)లను అందిస్తోంది. ఉపకార వేతనం పొందాలంటే.. ప్రవేశాలు పూర్తయ్యేనాటికి కళాశాలలు ఈ-పాస్​(ts epass registration)లో రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి. కానీ ఈ-పాస్​లో రిజిస్ట్రేషన్ చేయడంలో కళాశాల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తూ ఆలస్యం చేయడం వల్ల విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గత విద్యాసంవత్సరానికి 1172 కళాశాలలు దూరంగా ఉండగా.. ప్రస్తుత ఏడాదికి 2036 కళాశాలలు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు.

scholarships for telangana students
scholarships for telangana students
author img

By

Published : Nov 20, 2021, 7:22 AM IST

రాష్ట్రంలో ఉపకార వేతనాలు(scholarships for telangana students), బోధన రుసుం(tuition fees)ల విషయంలో కళాశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఏటా ఈ-పాస్‌(ts epass registration 2021)లో కళాశాలల రిజిస్ట్రేషన్‌ ఆలస్యంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రవేశాలు పూర్తయ్యే నాటికి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉండగా రెండేళ్లుగా విద్యాసంవత్సరం పూర్తయినా నమోదుకు దూరంగా ఉన్నాయి.

ఉపకారవేతనానికి అడ్డంకులు..

2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇప్పటికీ 1172 కళాశాలలు, 2021-22 ఏడాదికి 2036 కళాశాలలు ఈపాస్‌(ts epass registration 2021)లో గుర్తింపు పొందకపోవడంతో వాటిలో చదివే విద్యార్థులు ఉపకారవేతనాలు పొందేందుకు సాంకేతిక అడ్డంకులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు కోర్సు బోధన రుసుం(tuition fees for sc students)లను ప్రైవేటు కళాశాలలకు ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోంది. ఉపకార వేతనాలు(scholarships for telangana students), బోధన రుసుంలు కలిపి అయిదు వేలకు పైగా కళాశాలల్లో చదివే 12.5లక్షల మంది విద్యార్థులకు సర్కారు ఏటా దాదాపు రూ.2300 కోట్లు ఖర్చు చేస్తోంది.

ఓయూ పరిధిలోనే అత్యధికం..

ప్రభుత్వ గుర్తింపుతో పాటు ఈపాస్‌(ts epass registration 2021) వెబ్‌సైట్లో నమోదైన కళాశాలల్లో చదివే విద్యార్థులకు బోధన రుసుంలు మంజూరు చేస్తోంది. ఉన్నత విద్యాశాఖ, విశ్వవిద్యాలయాల ప్రమాణాలు పాటిస్తున్నట్లు సంబంధిత కళాశాలలు గుర్తింపు పునరుద్ధరించుకోవాలి. ఉస్మానియా వర్సిటీ(Osmania university news) పరిధిలోనే అత్యధికంగా కళాశాలలు ఈ-పాస్‌(ts epass registration 2021)లో నమోదుకు దూరంగా ఉన్నాయి.

ఈ విద్యా సంవత్సరానికి ఓయూ(Osmania university news) పరిధిలో 559 కళాశాలల్లో ప్రభుత్వ కళాశాలలు మినహా 542 కళాశాలలు ఈ-పాస్‌(ts epass registration 2021)లో నమోదు కాలేదు. కాకతీయ యూనివర్సిటీ(kakatiya university news) పరిధిలో 216, జేఎన్‌టీయూ(jntu news updates) పరిధిలో 366 కళాశాలలు, వైద్యవిద్య పరిధిలో 102 కళాశాలలు, 103 ఐటీఐలు, మిగతా కళాశాలలు సైతం ఉన్నాయి. ఇంటర్‌బోర్డు పరిధిలోని కళాశాలలన్నీ నమోదయ్యాయి.

సంక్షేమ శాఖ ఆంక్షలు..

కోర్సు పూర్తయిన వెంటనే విద్యార్థికి ధ్రువీకరణ పత్రాలిచ్చేందుకు బోధన రుసుం(tuition fees for engineering students)ల బకాయిలు చెల్లించాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తీసుకువస్తున్న కళాశాలలు సకాలంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం లేదు. గత విద్యాసంవత్సరానికి సంబంధించి 1172 కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల బోధన రుసుం(tuition fees for engineering students)లు, ఉపకార వేతానాల(scholarships for telangana students) దరఖాస్తులను ఈ కారణంతో సంక్షేమశాఖలు ఇప్పటికీ ఆమోదించలేదు. ఈ-పాస్‌(ts epass registration 2021)లో నమోదయ్యేవరకు ఆమోదించడానికి నిబంధనలు ఒప్పుకోవని సంక్షేమశాఖల వర్గాలు చెబుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.