ETV Bharat / city

రేపటి నుంచి జిల్లాల పర్యటనలకు సీఎం కేసీఆర్​

రేపటి నుంచి జిల్లాల వరుస పర్యటనలో సీఎం కేసీఆర్​ బిజీగా మారనున్నారు. 20న సిద్దిపేట, కామారెడ్డి, 21న వరంగల్​లో పర్యటించనున్న సీఎం... ఆకస్మిక తనిఖీలతోపాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు. 22న వాసాలమర్రిలో సహపంక్తి భోజనాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

CM KCR will start district tours from tomorrow

author img

By

Published : Jun 19, 2021, 4:16 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాల వరుస పర్యటనలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆయా జిల్లాల్లోని గ్రామాలు, పట్టణాల్లో ఆకస్మిక తనిఖీలతోపాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు. 20వ తేదీ ఉదయం ఆయన సిద్దిపేట, మధ్యాహ్నం కామారెడ్డి జిల్లాల్లో, 21న వరంగల్‌ నగర జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ల సమీకృతభవన సముదాయాలను ప్రారంభిస్తారు. సిద్దిపేటలో కొత్త పోలీసు కమిషనరేట్‌ భవనాన్ని, కామారెడ్డిలో ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్థలంలో నిర్మించనున్న ఎయిమ్స్‌ తరహా భారీ మల్టీ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేస్తారు. 22న ఆయన యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం వాసాలమర్రిని సందర్శిస్తారు. హైదరాబాద్‌కు కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాసాలమర్రిని దత్తత తీసుకుంటానని కేసీఆర్‌ గతంలో ప్రకటించారు.

సీఎం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని శాఖలు ఆ గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించాయి. అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళిక రూపొందించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. తర్వాత బహిరంగ సభ నిర్వహిస్తారు. మిగిలిన జిల్లాల పర్యటనలు తర్వాత ఖరారవుతాయి.

సిద్దిపేట సీపీ కార్యాలయం

పోలీసు కార్యాలయాలు సిద్ధం

రాష్ట్ర పోలీసు గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో సిద్దిపేట, రామగుండం పోలీసు కమిషనరేట్లు, మరో 13 జిల్లా పోలీసు కార్యాలయాల నిర్మాణం పూర్తయింది. కమిషనరేట్లకు రూ.30 కోట్ల చొప్పున, డీపీవోలకు రూ.19 కోట్ల చొప్పున వెచ్చించారు. అత్యాధునిక హంగులతో అంతర్జాతీయ సాంకేతికతను జోడించి వీటిని నిర్మించారు. పోలీసు కమిషనరేట్‌, ఎస్పీ కార్యాలయాలతో పాటు వారి నివాస గృహాలు, సమావేశ మందిరాలు నిర్మించారు. పరేడ్‌ మైదానాలు, విశాలమైన పార్కింగు స్థలాలను సిద్ధం చేస్తున్నారు. కమిషనరేట్‌, ఎస్పీ కార్యాలయాల పరిధిలో కార్యకలాపాల పర్యవేక్షణకు సీసీ కెమెరాలను సైతం అమర్చారు. సిద్దిపేట, కామారెడ్డి అనంతరం మిగిలిన పోలీసు కార్యాలయాలు సైతం ప్రారంభానికి సిద్ధమవుతున్నాయని పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్‌ కోలేటి దామోదర్‌ తెలిపారు.

21న యాదాద్రికి సీఎం!

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 21న యాదాద్రి పుణ్యక్షేత్ర సందర్శనకు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత తెలిపారు. ఆ రోజు వరంగల్‌ వెళ్తున్న సీఎం తిరుగు ప్రయాణంలో యాదాద్రికి రావచ్చని ఆమె చెప్పారు.

ఇదీ చూడండి: PM Modi: 66 శాతం మంది మోదీకే జై!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.