ETV Bharat / city

నీటిపారుదల రంగం ఇకపై జలవనరుల శాఖ: కేసీఆర్​ - జలవనరుల శాఖపై సీఎం సమీక్ష

CM kcr made changes in state water resources department
మార్పులకు అనుగుణంగా జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణ: కేసీఆర్​
author img

By

Published : Aug 11, 2020, 3:19 PM IST

Updated : Aug 11, 2020, 7:35 PM IST

15:17 August 11

మార్పులకు అనుగుణంగా జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణ: కేసీఆర్​

రాష్ట్ర నీటిపారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా ఆ శాఖను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలిపారు. మారిన పరిస్థితికి అనుగుణంగా జలవనరుల శాఖలో చీఫ్ ఇంజినీర్లు బాధ్యులుగా అధిక ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో మాదిరిగా వివిధ విభాగాల కింద కాకుండా జలవనరుల శాఖ అంతా ఒక విభాగంగానే పనిచేస్తుందని సీఎం వెల్లడించారు.  

జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణపై ప్రగతిభవన్​లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇంజినీర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు.. తర్వాత పరిస్థితిలో ఎంతో మార్పులు వచ్చాయని, సాగునీటి వసతులు మెరుగయ్యాయని సీఎం అన్నారు. ప్రాజెక్టులు, కాల్వలు, జలాశయాలు, పంపు హౌజ్​లు, ఆయకట్టు పెరిగినందున పని భారం కూడా పెరిగిందని తెలిపారు.  

క్షేత్రస్థాయిలో ప్రస్తుతం ఉన్న 13 చీఫ్ ఇంజినీర్ల ప్రాదేశిక ప్రాంతాల సంఖ్యను 19కి పెంచాలని నిర్ణయించారు. ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, రామగుండం, వరంగల్, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, గజ్వేల్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్​నగర్, వనపర్తి, నాగర్​కర్నూల్, హైదరాబాద్ కేంద్రాలుగా సీఈ ప్రాదేశిక ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.  

జలవనరుల శాఖగా మాత్రమే..

ఈ ప్రాదేశిక ప్రాంతాల పరిధిలోని ప్రాజెక్టులు, చెరువులు, ఐడీసీ ఎత్తిపోతలు, జలాశయాలు, ఆనకట్టలు, పంప్ హౌజ్​లు, కాలువలు, సబ్​స్టేషన్లు అన్ని ఇక నుంచి సీఈ పరిధి కిందికే వస్తాయి. గతంలో భారీ, మధ్య, చిన్న తరహా ఐడీసీ లాంటి వివిధ విభాగాల కింద ఉన్న నీటిపారుదల శాఖ ఇకపై కేవలం జలవనరుల శాఖగా మాత్రమే కొనసాగుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు.  

వనదుర్గ ప్రాజెక్టుగా నామకరణం..

మెదక్ జిల్లాలోని ఘన్​పూర్ ఆనకట్టకు వనదుర్గ ప్రాజెక్టుగా నామకరణం చేయాలని కేసీఆర్​ నిర్ణయించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన పాకాల కాల్వలు శిథిలమైపోయాయని, వాటిని పునరుద్ధరించడం ద్వారా 30 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు. స్పందించిన సీఎం కేసీఆర్ కాకతీయులు నిర్మించిన పాకాల కాల్వలను పునరుద్ధరించడమంటే వారసత్వాన్ని కాపాడుకోవడమే అని అన్నారు. కాల్వల పునరుద్ధరణకు వెంటనే అంచనాలు తయారు చేయాలని అధికారులను  ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశించారు.

ఇవీచూడండి: ఏపీ నోరు మూయించేలా సమాధానం చెబుతాం: కేసీఆర్​

Last Updated : Aug 11, 2020, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.