ETV Bharat / city

11న మంత్రులు, కలెక్టర్లతో సీఎం సమీక్ష - సీఎం కేసీఆర్ తాజా వార్తలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 11వ తేదీన రెవెన్యూ, పంచాయతీ రాజ్‌, పురపాలక, వైద్యారోగ్య, విద్యా, అటవీ శాఖలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11:30 గంటలకు ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఏయే అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారన్నది చర్చనీయాంశమైంది.

11న మంత్రులు, కలెక్టర్లతో సీఎం సమీక్ష
11న మంత్రులు, కలెక్టర్లతో సీఎం సమీక్ష
author img

By

Published : Jan 9, 2021, 4:32 AM IST

రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం, ధరణి, వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల నమోదు వివిధ నిర్ణయాల అమలుకు సంబంధించి సీఎం ఇటీవల ఆ శాఖ అధికారులతో సమీక్షలు జరిపారు. అందులో పెండింగ్‌ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ట్రైబ్యునళ్ల ఏర్పాటు, పార్ట్‌-బిలో చేర్చిన అంశాలకు సంబంధించి ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. 11న నిర్వహించే సమావేశంలో వీటిపై కూలంకషంగా చర్చించి, వాటి సత్వర పరిష్కారానికి అవసరమైన నిర్ణయాలను ప్రకటిస్తారు.

పనుల పురోగతి
పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన పనుల పురోగతిపై సమీక్షిస్తారు. పట్టణాలకు నిధులు సకాలంలో అందుతున్నాయా, వాటి వినియోగం ఎలా ఉంది, హరితహారం కార్యక్రమం అమలు, గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచడానికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తు కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

కరోనా టీకా
కరోనా వ్యాప్తి, నివారణ అంశాలతోపాటు కొవిడ్‌ టీకాను ప్రజలకు అందించే విషయంపై చర్చిస్తారు. వివిధ ప్రాంతాలకు టీకాల సరఫరా, ప్రాధాన్యక్రమంలో వాటిని వేయడంపై కార్యాచరణను ప్రకటిస్తారు. పౌరులకు వాటిని ఎప్పుడు అందుబాటులోకి తీసుకురావాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు.

విద్యాసంస్థలు
కరోనా కారణంగా రాష్ట్రంలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. వాటిని తిరిగి ఎలా ప్రారంభించాలనే దానిపై మంత్రులు, అధికారులతో సీఎం ప్రస్తావిస్తారు. తరగతులను ఎప్పటి నుంచి ప్రారంభించాలి, ఏ తరగతి నుంచి నిర్వహించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానం ఏంటీ.. తదితర అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటారు.

ఇవీ చూడండి: మరోసారి సీఎంలతో భేటీ కానున్న ప్రధాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.