ETV Bharat / city

దవాఖానాల్లో ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్​ గ్రీన్​సిగ్నల్​ - jobs in hospitals

నిరుద్యోగ వైద్య విద్యార్థులకు సీఎం కేసీఆర్​ శుభవార్త వినిపించారు. 114 దవాఖానాల్లో సరిపోను సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. తక్షణ ఆదేశాలు జారీ చేశారు.

cm kcr green signal to health posts in hospitals

author img

By

Published : Apr 26, 2021, 5:02 AM IST

కరోనా అనూహ్యంగా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వైద్యాన్ని మరింత అందుబాటులోకి తేవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ యుద్ధ ప్రాతిపదికన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందేలా 114 దవాఖానాల్లో సరిపోను సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి తక్షణ ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు 144 మంది డాక్టర్లు, 527 మంది నర్సు లు, 84 మంది ల్యాబ్ టెక్నీషియన్లతో కలిపి మొత్తం 755 పోస్టులను సీఎం మంజూరు చేశారు. తద్వారా రూ. 9.02 కోట్ల భారం రాష్ట్ర ఖజానా పై పడనుంది. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా...స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఇంటర్వూలు నిర్వహించనున్నారు. అర్హులైన సిబ్బంది నియామకాన్ని ఐదు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో ఆందోళనకు గురిచేస్తున్న కరోనా వ్యాప్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.