ETV Bharat / city

ఏపీ నోరు మూయించేలా సమాధానం చెబుతాం: కేసీఆర్​ - కేసీఆర్​ సమీక్ష

CM KCR FIRES ON AN AND CENTRAL GOVERNMENTS ON WATER ISSUES
ఏపీ నోరు మూయించేలా సమాధానం చెబుతాం: కేసీఆర్​
author img

By

Published : Aug 10, 2020, 4:59 PM IST

Updated : Aug 10, 2020, 10:22 PM IST

15:54 August 10

ఏపీ నోరు మూయించేలా సమాధానం చెబుతాం: కేసీఆర్​

      ప్రాజెక్టుల విషయంలో కేంద్రం, ఏపీ ప్రభుత్వ తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రాజెక్టులపై ఏపీ అర్థం లేని నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంభిస్తోందని విమర్శించారు. ప్రగతిభవన్​లో సీఎస్ సోమేశ్‌కుమార్, ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో భేటీ అయిన సీఎం.. కేంద్ర జలశక్తిశాఖ మంత్రి లేఖ, అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై చర్చించారు.  

రాష్ట్ర వైఖరి స్పష్టం..

అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సమర్థవంతంగా వాదనలు వినిపించాలని అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కేంద్రం, ఏపీకి వాస్తవాలు, సంపూర్ణ సమాచారంతో బలంగా సమాధానం చెప్పాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల విషయంలో ఏపీ ఫిర్యాదులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేసీఆర్.. తానే ఏపీ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడినట్లు గుర్తుచేశారు. రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మిద్దామని చెప్పినట్లు తెలిపారు. బేసిన్లు, భేషజాలు లేవని రాష్ట్ర వైఖరిని చాలా స్పష్టంగా చెప్పానన్నారు.  

ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటోంది..

 వృథాగా పోతున్న నీటిని పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామని చెప్పినట్లు సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటోందని.. రాష్ట్ర ప్రాజెక్టులపై అర్థంలేని, నిరాధార ఆరోపణలతో ఫిర్యాదు చేస్తోందని ధ్వజమెత్తారు. అపెక్స్ కమిటీ భేటీలో ఏపీ నోరు మూయించేలా సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రాజెక్టులపై మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఏపీకి కల్పిస్తామని కేసీఆర్​ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

కేంద్రం వైఖరిపైనా..  

తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర వైఖరి కూడా తప్పిదమేనని సీఎం అన్నారు. రాష్ట్రానికి ఉన్న నీటివాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని కేసీఆర్​ తెలిపారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందే అనుమతులు పొందిన ప్రాజెక్టులపై అభ్యంతరాలు సరికాదని సీఎం కేసీఆర్​ అన్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటి విడుదలలో కేంద్రం అభ్యంతర పెడుతోందని సీఎం వివరించారు. వాస్తవాలు పరిగణనలోకి తీసుకోకుండా అభ్యంతరాలు వ్యక్తం చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల హక్కులు హరించేలా కేంద్రం వ్యవహరించడం తగదని హితవు పలికారు. కేంద్ర వైఖరిని యావత్ దేశానికి తెలిసేలా చేస్తాం.. వాస్తవాలు వెల్లడిస్తామని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. 

కొత్త ప్రాజెక్టులంటారా..?

  వాస్తవానికి ఇంకా తెలంగాణకు నీటి అవసరం ఉందని సీఎం తెలిపారు. గోదావరి మిగులు జలాల్లో మరో వెయ్యి టీఎంసీలు దక్కాల్సి ఉందన్నారు. గోదావరికి తెలంగాణలోనే క్యాచ్‌మెంటు ఏరియా ఎక్కువన్న కేసీఆర్​.. సముద్రంలో కలిసే 2 వేల టీఎంసీల్లో కనీసం వెయ్యి టీఎంసీలు రాష్ట్రానికి కేటాయించాలన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికే ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టులు మంజూరయ్యాయని సీఎం స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ సహా ఇతర సంస్థల నుంచి అనుమతులు వచ్చాయన్నారు. దాదాపు రూ.23 వేల కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. 31,500 ఎకరాల భూ సేకరణ కూడా జరిగిందని వివరించారు. ఇంత జరిగాక ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు అనడం అర్థరహితం, అవివేకమని సీఎం మండిపడ్డారు. ప్రాణహిత-చేవెళ్లను.. కాళేశ్వరం, కంతనపల్లిని.. సమ్మక్క సాగర్, రాజీవ్​సాగర్​-ఇందిరాసాగర్‌ను.. సీతారామ, దుమ్ముగూడెంను.. సీతమ్మసాగర్‌గా రీడిజైన్‌ చేసి నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. 

పాలమూరు-రంగారెడ్డి విషయంలోనూ..

   సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో మంజూరయినప్పటికీ వాటిని పూర్తి చేయలేదన్నారు. తక్కువ నీటితో ఎక్కువ ఆయకట్టును ప్రతిపాదించారన్నారు. ఎక్కువ ఆయకట్టు వల్ల సాగునీటి అవసరాలు సంపూర్ణంగా తీరవని అభిప్రాయపడ్డారు. పెన్‌గంగ ప్రాజెక్టుకు 1975లోనే ఒప్పందం కుదిరి ట్రైబ్యునల్ అవార్డు పూర్తయిందని వివరించారు. అపెక్స్ కౌన్సిల్‌లో వాస్తవాలు ఉంచి తిరుగులేని సమాధానం చెప్పాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పాలమూరు-రంగారెడ్డి విషయంలోనూ వాస్తవాలను మరోసారి వివరిస్తామని స్పష్టం చేశారు. సాగునీటి రంగంలో తెలంగాణకు మొదటి నుంచీ అన్యాయం జరిగిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.  

ఇవీచూడండి: ఐఐటీ విద్యార్థినికి మంత్రి కేటీఆర్ చేయూత

Last Updated : Aug 10, 2020, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.