ETV Bharat / city

'కేసులు తగ్గుతున్నాయ్​.. కొన్ని జిల్లాలు ఇంకా మెరుగుపడాలి' - ఏపీలో కరోనా కేసులపై సీఎం జగన్​ సమీక్ష

ఏపీలో కరోనా కేసులు తగ్గుమఖం పడుతున్నాయని సీఎం జగన్​ అన్నారు. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో పరిస్థితి మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా నియంత్రణపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

jagan on covid cases
కరోనాపరిస్థితిపై ఏపీ సీఎం సమీక్ష
author img

By

Published : May 26, 2021, 5:02 PM IST

కొవిడ్​పై పోరాటంలో భాగమైన సిబ్బందిని ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. కొద్దిరోజులుగా కేసులు తగ్గుతున్నాయని.. సానుకూల పరిస్థితి ఏర్పడుతోందని సీఎం చెప్పారు. స్పందన కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి.. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో పరిస్థితి మెరుగుపడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉభయగోదావరి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో నిబంధనలు కచ్చితంగా అమలు కావాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.

"తరచుగా తప్పులు చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి. మొదటిసారి తప్పు చేస్తే జరిమానా... మళ్లీ చేస్తే కేసులు పెట్టాలి. 104కు ఎవరైనా ఫోన్‌ చేస్తే సరైన సమాధానం ఇవ్వాలి. సరిగ్గా స్పందించకుంటే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 దాటిన తర్వాత కచ్చితంగా కర్ఫ్యూ పాటించాలి. 45 ఏళ్లు పైబడిన వారికి పూర్తయ్యాక మిగిలిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వాలి. మొదటి డోస్‌ వేసుకొని రెండో డోస్‌ కోసం వేచిచూస్తున్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలి. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లపై నియంత్రణతో కొరత లేకుండా ఇవ్వగలుగుతున్నాం"

-వైఎస్ జగన్, ఏపీ ముఖ్యమంత్రి

ఇవీచూడండి: JUDA strike: 'రేపటి నుంచి అత్యవసర సేవలు కూడా బహిష్కరిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.