జూన్ 2023 నాటికి సమగ్ర భూ సర్వే పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. సమగ్ర భూ సర్వేపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకునేలా ముందుకు సాగాలన్నారు. అవసరమైన పరికరాలు, వనరులను సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు. డ్రోన్లు సహా అవసరమైనవి కొనుగోలు చేయాలని ఆదేశించారు.
ఈ ప్రక్రియలో.. అత్యుత్తమ సాంకేతికత వినియోగంతోపాటు సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇవ్వాలన్నారు. సర్వే త్వరితగతిన పూర్తిచేయడానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. సమగ్ర భూసర్వే ప్రక్రియలో అవినీతికి తావు ఉండకూడదని చెప్పారు. ప్రతి 4 వారాలకు ఒకసారి సమగ్ర సర్వేపై సమీక్షిస్తానని స్పష్టం చేశారు. స్పందనలో భాగంగా కలెక్టర్లతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ సమీక్ష ఉంటుందన్నారు. భూసర్వేపై వారానికి ఒకసారి మంత్రుల కమిటీ సమీక్ష చేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: Minister Harish Rao : 'రాష్ట్రం కుడి చేయితో ఇస్తే.. కేంద్రం ఎడమ చేత్తో తీసుకుంటోంది'