ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పొందూరులో సభాపతి తమ్మినేని సీతారాం సమక్షంలోనే వైకాపా నేతల్లో వర్గ విభేదాలు తలెత్తాయి. సభాపతి సొంత నియోజకవర్గం ఆమదాలవలసలోనే వివాదాలు బహిర్గతమయ్యాయి. పొందూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో... వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన సభాపతి తమ్మినేని ఎదుటే.. వైకాపా నేతలు వర్గాలుగా విడిపోయి ఘర్షణ పడ్డారు.
పరిస్థితి అదుపు తప్పి.. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇళ్ల స్థలాల జాబితా తయారీ విషయంలో.. కార్యకర్తలు ఇలా సభాపతి సాక్షిగా బాహాబాహీకి దిగారు. చివరికి పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.
ఇదీ చూడండి: హరితహారంలో కేసీఆర్.. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ప్రారంభించిన సీఎం