ఆన్‌లైన్ తరగతుల పేరుతో ప్రైవేట్ బడుల ఫీజుల వసూలుపై.. నివేదిక సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను....రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఆదేశించింది. 'బడి తెగింపు' శీర్షికతో ఈనాడులో శుక్రవారం ప్రచురితమైన కథనాన్ని...... సుమోటోగా విచారణకు స్వీకరించింది.
ఫీజులు పెంచవద్దని, బోధనా ఫీజు మాత్రమే నెలవారీగా వసూలు చేసుకోవాలని ఏప్రిల్ 21న ప్రభుత్వం జీవో 46 జారీ చేసిందని... బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆన్‌లైన్ తరగతుల పేరిట ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘిస్తే.. తగిన చర్యలు తీసుకోవాలని.. కమిషన్ స్పష్టం చేసింది. తీసుకున్న చర్యలపై జులై 6లోగా నివేదిక సమర్పించాలని బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్.. పాఠశాల విద్యాశాఖ సంచాలకుడిని ఆదేశించారు.
ఇవీచూడండి: ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యం.. ప్రభుత్వం చెప్పినా ఫీ'జులుం'